Telugu Global
Cinema & Entertainment

ఈసారి మెగా ట్రాప్ నుంచి బయటపడతాడా..

మొన్నటివరకు మెగా ట్రాక్ లో ఇరుక్కున్నాడు నాగశౌర్య. ఒక మనసు సినిమా విడుదలైనప్పటి నుంచి అంతా మెగా హీరోోయిన్ నిహారిక గురించే మాట్లాడారు తప్ప… తన గురించి ఎవ్వరూ మాట్లాడలేదని తెగ బాధపడ్డాడు. నిజానికి ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నిహారిక ట్రెండింగ్ అయింది తప్ప నాగశౌర్యపై మాత్రం చర్చ జరగలేదు. పోనీ… కామ్ గా సైడ్ అయిపోదామంటే… సినిమా పరాజయ భారం మాత్రం నాగశౌర్యపై పడిపోయింది. దీంతో ఆ ప్రాజెక్టు ప్రభావం నుంచి ఎలాగోలా […]

ఈసారి మెగా ట్రాప్ నుంచి బయటపడతాడా..
X

మొన్నటివరకు మెగా ట్రాక్ లో ఇరుక్కున్నాడు నాగశౌర్య. ఒక మనసు సినిమా విడుదలైనప్పటి నుంచి అంతా మెగా హీరోోయిన్ నిహారిక గురించే మాట్లాడారు తప్ప… తన గురించి ఎవ్వరూ మాట్లాడలేదని తెగ బాధపడ్డాడు. నిజానికి ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నిహారిక ట్రెండింగ్ అయింది తప్ప నాగశౌర్యపై మాత్రం చర్చ జరగలేదు. పోనీ… కామ్ గా సైడ్ అయిపోదామంటే… సినిమా పరాజయ భారం మాత్రం నాగశౌర్యపై పడిపోయింది. దీంతో ఆ ప్రాజెక్టు ప్రభావం నుంచి ఎలాగోలా బయటపడ్డాడు నాగశౌర్య. ప్రస్తుతం మరో సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉన్నాడు.

దాదాపు రెండేళ్ల కిందట నాగశౌర్య నటించిన “నీ జతలేక” అనే సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమౌతోంది. తెరవెనక కారణాల వల్ల ఇన్నాళ్లూ విడుదలకాకుండా ముగ్గిపోయిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై నాగశౌర్యకు గట్టినమ్మకమే ఉంది. సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని, కచ్చితంగా తనకు పూర్వ వైభవం తీసుకొస్తుందని ధీమాగా నలుగురితో చెబుతున్నాడు. పంజాబీ నటి పారుల్ గులాటీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే బాబు బంగారం సినిమా విడుదలైన ఒక్క రోజు తేడాతోనే నాగశౌర్య సినిమాను తీసుకురావడం ఏం బాగాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలే ఫ్లాపుతో ఇబ్బందిపడుతున్న నాగశౌర్య… తన కొత్త సినిమాను ఎలాంటి పోటీలేని టైంలో దించితే కాస్తయినా లాభపడతాడని సూచిస్తున్నారు. మరి రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First Published:  26 July 2016 4:28 AM GMT
Next Story