Telugu Global
Cinema & Entertainment

కబాలి పోయింది... మళ్లీ రోబో వచ్చింది...

కబాలి సినిమాకు ఓవర్సీస్ లో తప్ప మిగతా అన్ని దేశాలు, ప్రాంతాల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది క్లియర్ ఫ్లాప్ ముద్ర కూడా వేయించుకుంది. ఈ విషయంలో అభిమానులు కూసింత నిరుత్సాహానికి గురైనప్పటికీ… రజనీకాంత్ అమెరికా నుంచి ఇఁడియాకు తిరిగిరావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. పనిలోపనిగా తలైవ అభిమానులంతా ఇప్పుడు కబాలి గురించి మాట్లాడుకోవడం మానేశారు. రజనీ చెన్నై వచ్చాడు కాబట్టి… రోబో 2.0 షూటింగ్ ను […]

కబాలి పోయింది... మళ్లీ రోబో వచ్చింది...
X
కబాలి సినిమాకు ఓవర్సీస్ లో తప్ప మిగతా అన్ని దేశాలు, ప్రాంతాల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది క్లియర్ ఫ్లాప్ ముద్ర కూడా వేయించుకుంది. ఈ విషయంలో అభిమానులు కూసింత నిరుత్సాహానికి గురైనప్పటికీ… రజనీకాంత్ అమెరికా నుంచి ఇఁడియాకు తిరిగిరావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. పనిలోపనిగా తలైవ అభిమానులంతా ఇప్పుడు కబాలి గురించి మాట్లాడుకోవడం మానేశారు. రజనీ చెన్నై వచ్చాడు కాబట్టి… రోబో 2.0 షూటింగ్ ను ఎప్పుడు మొదలుపెడతాడా అని అంతా డిస్కస్ చేసుకోవడం కనిపించింది.
శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రజనీకాంత్ రోబో 2.0 షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతదేశ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే రజనీకాంత్ కబాలికి షిఫ్ట్ అవ్వడం… ఆరోగ్యం కూడా బాగాలేదని వార్తలు రావడం జరిగిపోయాయి. దీంతో రోబో 2.0 సినిమాపై అనుమానాలు పెరిగిపోయాయి. ఎట్టకేలకు రజనీకాంత్ తిరిగి చెన్నై రావడంతో… రోబో 2.0 హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం… ఆగస్ట్ మొదటి వారంలో రోబో 2.0 షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా… దాదాపు 3వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రోబో 2.0 తెరకెక్కుతోంది.
First Published:  26 July 2016 12:34 AM GMT
Next Story