Telugu Global
Health & Life Style

ర‌క్తంలో ఔష‌ధాల‌ను ప‌ర్య‌వేక్షించే ప‌ట్టీ

వైద్య చికిత్స తీసుకుంటున్న రోగి శ‌రీరంలోని ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో ఔష‌ధాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు తోడ్ప‌డే స‌రికొత్త సూక్ష్మ‌సూది ప‌ట్టీని శాస్త్ర‌వేత్త‌లు రూపొందించారు. ఇందుకోసం రోగికి సంబంధించి ఎలాంటి ర‌క్తాన్ని సేక‌రించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సూక్ష్మ సూది ఔష‌ధ ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను కెన‌డాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వ‌విద్యాల‌యం, స్విట్జ‌ర్లాండులోని పాల్ ష్రెర్ర‌ర్ ఇనిస్టిట్యూట్ ప‌రిశోధ‌కులు తీర్చిదిద్దారు. ఈ విధానం ఒంట్లో సూది గుచ్చి ర‌క్తాన్ని సేక‌రించే ప్ర‌క్రియ‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మారుతుంద‌నీ, రోగికి సౌక‌ర్యం మెరుగ‌వుతుంద‌ని వారు […]

వైద్య చికిత్స తీసుకుంటున్న రోగి శ‌రీరంలోని ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో ఔష‌ధాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు తోడ్ప‌డే స‌రికొత్త సూక్ష్మ‌సూది ప‌ట్టీని శాస్త్ర‌వేత్త‌లు రూపొందించారు. ఇందుకోసం రోగికి సంబంధించి ఎలాంటి ర‌క్తాన్ని సేక‌రించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సూక్ష్మ సూది ఔష‌ధ ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను కెన‌డాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వ‌విద్యాల‌యం, స్విట్జ‌ర్లాండులోని పాల్ ష్రెర్ర‌ర్ ఇనిస్టిట్యూట్ ప‌రిశోధ‌కులు తీర్చిదిద్దారు. ఈ విధానం ఒంట్లో సూది గుచ్చి ర‌క్తాన్ని సేక‌రించే ప్ర‌క్రియ‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మారుతుంద‌నీ, రోగికి సౌక‌ర్యం మెరుగ‌వుతుంద‌ని వారు పేర్కొన్నారు. ఇందులో చిన్న‌పాటి, ప‌లుచ‌ని ప‌ట్టీని రోగి చేతిపై నొక్కి ఉంచితే, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లోని ఔష‌ధాల ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని ప‌రిశోధ‌కులు వివ‌రించారు. ఈ ప‌ట్టీలో అమ‌ర్చిన అర మిల్లీమీట‌ర్ క‌న్నా త‌క్కువ‌గానే ఉండే సూక్ష్మ సూది ఉంటుంది. సాధార‌ణ ఇంజ‌క్ష‌న్‌లా చ‌ర్మంలోకి గుచ్చుకోకుండా, పైపొర వ‌ర‌కు మాత్ర‌మే దిగుతుంద‌ని పేర్కొన్నారు. నొప్పి లేకుండా ర‌క్తంలోని ఔష‌ధాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం స‌రికొత్త ఆలోచ‌న అని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.
First Published:  27 July 2016 10:59 AM GMT
Next Story