Telugu Global
Cinema & Entertainment

గోపిచంద్  ఫ‌స్ట్ టైమ్ ఇలా క‌మిటైయ్యాడు..!

గోపిచంద్  చిత్రాల్లో విల‌న్ ల సంఖ్య ఎక్కువుగా వుంటుందేమో కానీ.. హీరోయిన్ నెంబ‌ర్ మాత్రం సింగిలే.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల్లో  ఇద్ద‌రు హీరోయిన్స్ తో చేసిన చిత్రం ఏది లేదు. కానీ తొలిసారి ఆయ‌న కూడా ఇద్ద‌రు హీరోయిన్స్ తో ఆడి పాడ‌నున్నారు.  శ్రీ బాలాజీ గోపి మీడియా పై   సంప‌త్ నంది  డైరెక్ష‌న్ లో  ఒక చిత్రం  తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో  హ‌న్సిక‌, కేథ‌రిన్ లు న‌టించనున్నారు.   గోపిచంద్ కు […]

గోపిచంద్  ఫ‌స్ట్ టైమ్ ఇలా క‌మిటైయ్యాడు..!
X
గోపిచంద్ చిత్రాల్లో విల‌న్ ల సంఖ్య ఎక్కువుగా వుంటుందేమో కానీ.. హీరోయిన్ నెంబ‌ర్ మాత్రం సింగిలే. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల్లో ఇద్ద‌రు హీరోయిన్స్ తో చేసిన చిత్రం ఏది లేదు. కానీ తొలిసారి ఆయ‌న కూడా ఇద్ద‌రు హీరోయిన్స్ తో ఆడి పాడ‌నున్నారు. శ్రీ బాలాజీ గోపి మీడియా పై సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో ఒక చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో హ‌న్సిక‌, కేథ‌రిన్ లు న‌టించనున్నారు. గోపిచంద్ కు ఆడియ‌న్స్ లో ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా వుంటుంద‌ని నిర్మాత‌లు జె పుల్లారావు, జే భ‌గ‌వాన్ లు తెలిపారు.
భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది బెంగాల్ టైగ‌ర్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ అందిస్తుండ‌గా.. ఎస్ సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫి చేస్తున్నారు. మ‌రి ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో వ‌స్తున్న గోపి ఏ రేంజ్ హిట్ అందుకుంటాటో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  27 July 2016 11:52 AM GMT
Next Story