Telugu Global
Health & Life Style

వేరుశెన‌గ‌లో క్యాన్స‌ర్ కార‌కాన్ని ప‌సిగ‌ట్టే ప‌రిక‌రాన్ని రూపొందించిన ఇక్రిశాట్‌

క్యాన్స‌ర్, కాలేయ‌, వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతున్న వేరుశెన‌గ‌లోని విష‌పూరిత ఫంగ‌స్‌ను గుర్తించే ప‌రిక‌రాన్ని అంత‌ర్జాతీయ మెట్ట ప‌రిశోధ‌న సంస్థ (ఇక్రిశాట్‌) త‌క్కువ వ్య‌యంతో త‌యారు చేసింది. దీని ఖ‌రీదు రూ 135 మాత్ర‌మేన‌ని అధికారులు వెల్ల‌డించారు. వేరుశెన‌గ పంట‌ను ఎక్కువ‌గా పండించే ఆసియా, ఆఫ్రికా దేశాల‌కు వీటిని భారీ ఎత్తున ఎగుమ‌తి చేసే అవ‌కాశం ఉంద‌ని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. రెండు మాసాల్లో దీనిని మార్కెట్లోకి విడుద‌ల చేస్తామ‌ని వారు వెల్ల‌డించారు. ఈ ప‌రిక‌రాన్ని అభివృద్ధి చేసేందుకు మెక్ […]

వేరుశెన‌గ‌లో క్యాన్స‌ర్ కార‌కాన్ని ప‌సిగ‌ట్టే ప‌రిక‌రాన్ని రూపొందించిన ఇక్రిశాట్‌
X
క్యాన్స‌ర్, కాలేయ‌, వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతున్న వేరుశెన‌గ‌లోని విష‌పూరిత ఫంగ‌స్‌ను గుర్తించే ప‌రిక‌రాన్ని అంత‌ర్జాతీయ మెట్ట ప‌రిశోధ‌న సంస్థ (ఇక్రిశాట్‌) త‌క్కువ వ్య‌యంతో త‌యారు చేసింది. దీని ఖ‌రీదు రూ 135 మాత్ర‌మేన‌ని అధికారులు వెల్ల‌డించారు. వేరుశెన‌గ పంట‌ను ఎక్కువ‌గా పండించే ఆసియా, ఆఫ్రికా దేశాల‌కు వీటిని భారీ ఎత్తున ఎగుమ‌తి చేసే అవ‌కాశం ఉంద‌ని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. రెండు మాసాల్లో దీనిని మార్కెట్లోకి విడుద‌ల చేస్తామ‌ని వారు వెల్ల‌డించారు. ఈ ప‌రిక‌రాన్ని అభివృద్ధి చేసేందుకు మెక్ నైట్ పౌండేష‌న్ నిధులు స‌మ‌కూర్చింద‌ని ఆఫ్రికాలోని మ‌లావీ దేశానికి చెందిన ప‌లు సంస్థ‌లు ఇందులో భాగ‌స్వామ్య‌మ‌య్యాయ‌ని అధికారులు వివ‌రించారు. ఈ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించి వ్య‌వ‌సాయ‌దారులు 15 నిమిషాల్లో ఫ‌లితం తెలుసు కోవ‌చ్చ‌ని వారు పేర్కొన్నారు.
First Published:  27 July 2016 11:00 AM GMT
Next Story