Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ కు కొరటాల అందుకే హ్యాండ్ ఇచ్చాడా...?

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో కొరటాల శివ ఒకడు. మిర్చి.. శ్రీ‌మంతుడు పేరుతో రెండే రెండు సినిమాలు తీశాడు. జ‌న‌తా గ్యారేజ్ సెట్స్‌పై వుంది. అయినప్పటికీ… ఆ రెండు హిట్స్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి స్టార్స్ ఎదురుచూస్తున్నారు. ఇలా ఎవ్వ‌రూ ఎదురుచూడ‌ని సమయంలో… రామ్‌చ‌ర‌ణ్‌ తో ఓ సినిమా అవకాశం దక్కించుకున్నాడు కొరటాల. మిర్చి త‌ర్వాత కొర‌టాల, చెర్రీ కాంబినేషన్ లో సినిమా పూజా కార్య‌క్రమాల‌తో మొద‌లలైంది. కొర‌టాల క‌థ‌పై చెర్రీకి […]

రామ్ చరణ్ కు కొరటాల అందుకే హ్యాండ్ ఇచ్చాడా...?
X

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో కొరటాల శివ ఒకడు. మిర్చి.. శ్రీ‌మంతుడు పేరుతో రెండే రెండు సినిమాలు తీశాడు. జ‌న‌తా గ్యారేజ్ సెట్స్‌పై వుంది. అయినప్పటికీ… ఆ రెండు హిట్స్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి స్టార్స్ ఎదురుచూస్తున్నారు. ఇలా ఎవ్వ‌రూ ఎదురుచూడ‌ని సమయంలో… రామ్‌చ‌ర‌ణ్‌ తో ఓ సినిమా అవకాశం దక్కించుకున్నాడు కొరటాల. మిర్చి త‌ర్వాత కొర‌టాల, చెర్రీ కాంబినేషన్ లో సినిమా పూజా కార్య‌క్రమాల‌తో మొద‌లలైంది. కొర‌టాల క‌థ‌పై చెర్రీకి న‌మ్మ‌కం లేక‌.. అప్పట్లో ఆ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెట్టేశాడు. దీంతో.. కొర‌టాల శివ, మ‌హేశ్‌తో శ్రీ‌మంతుడు తీసి సూప‌ర్‌హిట్ కొట్టాడు. ఈ హిట్‌తో ఖంగుతిన్న చెర్రీ.. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఇంట్రెస్ట్ చూపించాడు. చెర్రీ, కొర‌టాల క‌ల‌యిక‌లో సినిమా వుంటుంద‌ని చాలాకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జనతా గ్యారేజీ తర్వాత చెర్రీతోనే సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈసారి కొరటాల, చెర్రీకి హ్యాండ్ ఇచ్చాడు. జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత మ‌హేశ్‌ను డైరెక్ట్ చేయ‌డానికే కొర‌టాల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మ‌హేశ్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమా ఆగ‌స్ట్‌లో మొద‌ల‌వుతుంది. ఇది పూర్త‌య్యేలోపు బౌండ్ స్కిప్ట్‌తో రెడీగా వుంటాడు కొర‌టాల‌. ఈలెక్క‌న‌. కొర‌టాల‌.. చెర్రీ సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే.

First Published:  27 July 2016 3:33 AM GMT
Next Story