ఆ విషయంలో చిరంజీవి మంచోడే…

తనవాళ్లు అనుకుంటే చిరంజీవి ఎవర్నీ మిస్ చేసుకోడు. వాళ్లలో లాంగ్ టైమ్ అసోసియేషన్ కోరుకుంటాడు. మధ్యలో ఒకరిద్దర్ని మిస్ చేసుకొని ఉండొచ్చుకానీ… చిరంజీవికి లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్సే ఎక్కువ. తాజాగా అలాంటి ఓ ఫ్రెండ్ కు చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కలలో కూడా దక్కదనుకున్న 150వ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు నామమాత్రపు రేటుకు అతడికి అప్పగించేశాడు. 
 
ఉత్తరాంధ్రలో ఎక్కువగా సినిమాలు పంపిణీ చేసే క్రాంతి పిక్చర్స్ సంస్థతో చిరంజీవికి దశాబ్దాల అనుబంధం ఉంది. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్ని క్రాంతి పిక్చర్స్ సంస్థ పంపిణీ చేసింది. చిరు మరోసారి ముఖానికి రంగేసుకున్న ఈ తరుణంలో… 150వ సినిమా హక్కుల్ని కూడా దక్కించుకోవడానికి క్రాంతి పిక్చర్స్ ప్రయత్నించింది. అయితే 150వ సినిమాకు భారీగా పోటీ ఉండడంతో… పాటు హక్కుల కోసం బడా బాబులు, రాజకీయ నాయకులు సైతం రంగంలోకి దిగారు. దీంతో క్రాంతి పిక్చర్స్ వాళ్లు తమకు ఇక రాదని తప్పుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం వాళ్లకు కబురుపెట్టి మరీ ఉత్తరాంధ్ర రైట్స్ అప్పగించినట్టు తెలుస్తోంది.
Click on Image to Read:
chiru-150th-movie