తన హీరోయిన్ భర్తనే విలన్ గా పెట్టుకున్న చిరంజీవి

చిరంజీవి సినిమాలో విలన్ ఎవరనేది తేలిపోయింది. గతంలో తన సరసన హీరోయిన్ గా నటించిన అంజలి జవేరి భర్తనే చిరంజీవి… తన రీఎంట్రీ మూవీలో విలన్ గా పెట్టుకున్నాడు. సినిమాల నుంచి తప్పుకున్న అంజలీ జవేరీ… మోడల్ తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుంది. తర్వాత తరుణ్ మోడలింగ్ నుంచి సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. జబ్ వియ్ మెట్ తో పాటు మరెన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ఇతడ్నే చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడులో విలన్ గా ఫిక్స్ చేశారు. 
నిజానికి చిరు సినిమాలో జగపతిబాబును విలన్ గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత వివేక్ ఒబరాయ్, నీల్ నితిన్ ముఖేష్ పేర్లు కూడా వినిపించాయి. తనకు స్టోరీలైన్ నచ్చలేదని జగపతిబాబు తన సన్నిహితుల మధ్య ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. మొత్తమ్మీద వీళ్లందర్నీ కాదని తరుమ్ అరోరాను చిరు 150వ సినిమాలో విలన్ గా ఫిక్స్ చేశారు.
చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి హీరోయిన్, విలన్ ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. హీరోయిన్ కన్ ఫర్మ్ అవ్వకపోయినా ప్రస్తుతానికి ఫర్వాలేదు. కానీ విలన్ మాత్రం అర్జెంట్ గా కావాలి. పైగా ఎన్ని కాల్షీట్లు కావాలంటే అన్ని కాల్షీట్లు ఇచ్చే విలన్ కావాలి. త్వరలోనే ప్రారంభం కాబోతున్న మూడో షెడ్యూల్ కు అర్జెంట్ గా విలన్ అవసరం. అందుకే పెద్దగా పేరులేని తరుణ్ అరోరాను హుటాహుటిన విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద అంజలా జవేరీ మొగడు అద్భుతమైన అవకాశమే కొట్టేశాడు. 
Click on Image to Read:
chiru