Telugu Global
Cinema & Entertainment

వచ్చే ఏడాదికి కమల్ సినిమా వాయిదా

శభాష్ నాయుడు సినిమాను మాంఛి ఊపుమీద ప్రారంభించాడు కమల్ హాసన్. కానీ అన్నీ తను అనుకున్నట్టు జరగవు కదా. అనుకోని ఎన్నో అవాంతరాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. ఫలితంగా త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా ఈ ఏడాది విడుదలయ్యేది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.  ఈ ప్రాజెక్టు ప్రారంభమైన వెంటనే దర్శకుడు రాజీవ్ జబ్బు పడ్డాడు. దీంతో కమల్ హాసన్ స్వయంగా మెగాఫోన్ పట్టుకోవాల్సి […]

వచ్చే ఏడాదికి కమల్ సినిమా వాయిదా
X
శభాష్ నాయుడు సినిమాను మాంఛి ఊపుమీద ప్రారంభించాడు కమల్ హాసన్. కానీ అన్నీ తను అనుకున్నట్టు జరగవు కదా. అనుకోని ఎన్నో అవాంతరాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. ఫలితంగా త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా ఈ ఏడాది విడుదలయ్యేది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు ప్రారంభమైన వెంటనే దర్శకుడు రాజీవ్ జబ్బు పడ్డాడు. దీంతో కమల్ హాసన్ స్వయంగా మెగాఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత కమల్ కూడా గాయపడ్డాడు. దాదాపు 3 వారాలు మంచానికే పరిమితం అయ్యాడు. మరోవైపు ఈ సినిమా ఎడిటర్, తన భార్యను పోగొట్టుకొని తీవ్రశోకంలోకి వెళ్లిపోయాడు. తాజాగా సినిమాటోగ్రాఫర్ కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. వీటికి తోడు శృతిహాసన్ కూడా కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయడం కష్టంగా మారిపోయింది. ఇవన్నీ కలుపుకొని చూస్తే… ఈ ఏడాది శభాష్ నాయుడు సినిమా విడుదలయ్యేది అనుమానంగానే కనిపిస్తోంది.
First Published:  28 July 2016 6:33 AM GMT
Next Story