Telugu Global
Cinema & Entertainment

అవ‌స‌ర‌మైతే కిక్ బాక్సింగ్ ఆడిస్తా అంటున్న  హీరోయిన్...

ఈ రోజుల్లో  ఎక్క‌డైన ఉనికిని చాటుకోవాలంటే  ఒక్క టాలెంట్ ఉంటే స‌రిపోదు.  మ‌ల్టీ టాలెంట్ ఉండాలంటోంది  హీరో్యిన్   మ‌న్నార్ చోప్రా.సునిల్  న‌టించిన జ‌క్క‌న చిత్రంలో  ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ గా చేసిన    మ‌న్నార్ చోప్రా  ఈచిత్రంలో   కరాటే, కిక్ బాక్సింగ్  చేసిన‌ట్లు చెప్పికొచ్చింది.  గ‌తంలో     ఇండియ‌న్ ఐడిల్  సింగర్ రామ‌చంద్ర   న‌టించిన  ప్రేమ గీమ  జాన్తా నై చిత్రంలో    తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం […]

అవ‌స‌ర‌మైతే కిక్ బాక్సింగ్ ఆడిస్తా అంటున్న  హీరోయిన్...
X
ఈ రోజుల్లో ఎక్క‌డైన ఉనికిని చాటుకోవాలంటే ఒక్క టాలెంట్ ఉంటే స‌రిపోదు. మ‌ల్టీ టాలెంట్ ఉండాలంటోంది హీరో్యిన్ మ‌న్నార్ చోప్రా.సునిల్ న‌టించిన జ‌క్క‌న చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ గా చేసిన మ‌న్నార్ చోప్రా ఈచిత్రంలో కరాటే, కిక్ బాక్సింగ్ చేసిన‌ట్లు చెప్పికొచ్చింది. గ‌తంలో ఇండియ‌న్ ఐడిల్ సింగర్ రామ‌చంద్ర న‌టించిన ప్రేమ గీమ జాన్తా నై చిత్రంలో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం జ‌క్క‌న్న చిత్రంతో పాటు.. సాయిధ‌ర‌మ్ తేజ తో తిక్క చిత్రంలో కూడా న‌టిస్తుంది.
జ‌క్క‌న చిత్రం శుక్ర‌వారం రిలీజ్ కు సిద్దం అయ్యింది. ఈసినిమా గురించి మన్నార్ చోప్రా ప‌లు విశేషాలు తెలిపింది. సినిమా సునిల్ మార్క్ కామెడి ఆద్యంతం ఉంటుందిని తెలిపింది. అయితే ఈ చిత్రంలో త‌న‌కు క‌రాటే, కిక్ బాక్సింగ్ చేసే అవ‌కాశం రావ‌డం అదృష్టమ‌ని తెలిపింది. త‌న టాలెంట్ ను చూపించుకునే చాన్స్ వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది. మ‌న్నార్ అంటే ప్ర‌కాశించేంది అని మీనింగ్ ట . త‌న కెరీర్ ఎప్పుడు ప్ర‌కాశించాల‌ని పేరు మార్చుకుంద‌ట‌. తిక్క చిత్రంతో పాటు .. పూరి జ‌గ‌న్నాధ్ డైరెక్ష‌న్ చేయ‌నున్న రోగ్ చిత్రంలో కూడా త‌ను న‌టిస్తుంద‌ట‌. జ‌క్క‌న్న చిత్రం జూలై 29 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే.
First Published:  27 July 2016 9:31 PM GMT
Next Story