Telugu Global
Cinema & Entertainment

క‌బాలి పై బాలీవుడ్ యాక్ట‌ర్ ఎటాక్...! 

నానా ప‌టేక‌ర్ అంటే తెలియ‌ని బాలీవుడ్ సినిమా అభిమాని వుండ‌రు. రియ‌లిస్టిక్ యాక్టింగ్ లో   ప్ర‌తిభావంతుడిగా పేరున్న నానా ప‌టేక‌ర్  ఈ మ‌ధ్య విడుద‌లైన ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమా పై ఘాటైన విమ‌ర్శ‌లు చేశార‌నే టాక్ వినిపిస్తుంది. అంటే  ఆయ‌న డైరెక్ట్ గా ర‌జ‌నీకాంత్ ని క్రిటిసైజ్ చేయ‌లేదు కానీ.. సూప‌ర్ స్టార్ అంటే సినిమా అని తేల్చారు. క‌థ బావుంటే చిన్న న‌టులైనా  స్టార్స్ అవుతారు.  అదే క‌థ బాగలేక పోతే  మూడో రోజు నుంచి స్టార్స్  ఉన్న‌ప్ప‌టికి […]

క‌బాలి పై బాలీవుడ్ యాక్ట‌ర్ ఎటాక్...! 
X
నానా ప‌టేక‌ర్ అంటే తెలియ‌ని బాలీవుడ్ సినిమా అభిమాని వుండ‌రు. రియ‌లిస్టిక్ యాక్టింగ్ లో ప్ర‌తిభావంతుడిగా పేరున్న నానా ప‌టేక‌ర్ ఈ మ‌ధ్య విడుద‌లైన ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమా పై ఘాటైన విమ‌ర్శ‌లు చేశార‌నే టాక్ వినిపిస్తుంది. అంటే ఆయ‌న డైరెక్ట్ గా ర‌జ‌నీకాంత్ ని క్రిటిసైజ్ చేయ‌లేదు కానీ.. సూప‌ర్ స్టార్ అంటే సినిమా అని తేల్చారు.
క‌థ బావుంటే చిన్న న‌టులైనా స్టార్స్ అవుతారు. అదే క‌థ బాగలేక పోతే మూడో రోజు నుంచి స్టార్స్ ఉన్న‌ప్ప‌టికి ఆడియ‌న్స్ థియేట‌ర్ కు రావ‌డం క‌ష్ట‌మే అన్నారు.బాలీవుడ్ లో స‌లీమ్ -జావేద్ లు వంటి ర‌చ‌యిత‌లు చాలా మందిని స్టార్స్ ను చేశారు. కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది. ఆ కథే బాలేకపోతే ఎంత పెద్ద స్టార్‌ నటుడైనా ఏమీ చేయలేడు అంటూ తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు నానా పటేకర్‌. ఇదిలా వుంటే క‌బాలి మాత్రం రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుండ‌టం విశేషం.
First Published:  28 July 2016 9:57 AM GMT
Next Story