షారూఖ్ కు స‌న్నీలియోన్ గండం!

స‌న్నీలియోన్ ఈ ఒక్క పేరు చాలు.. కుర్ర‌కారును థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి.. కొంత‌కాలంగా స్టార్ హీరోలు సైతం  త‌మ‌సినిమాల్లో ఈ సెక్స్‌బాంబుతో ఐట‌మ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా షారూఖ్‌ఖాన్ కూడా ఈ జాబితాలో చేరారు. దీపావ‌ళికి షారూఖ్ సినిమా రాయిస్ విడుద‌ల కానుంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లోనూ ఈసినిమా విడుద‌ల కోసం షారూఖ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల రాయిస్ సినిమాను చూసిన అక్క‌డి సెన్సార్ బోర్డు స‌భ్యులు సినిమా విడుద‌ల‌కు నో చెప్పారు. అస‌లువిష‌యం విని షారూఖ్ అదిరిప‌డ్డాడు. కార‌ణం స‌న్నీలియోన్ అని తెలియ‌డంతో క‌ళ్లు బైర్లుక‌మ్మాయి షారూఖ్‌కి.
అందాల ఆర‌బోత‌లో ఆరితేరిన‌, న‌టి సన్నీలియోన్ పాట ఉంటే పాకిస్తాన్‌లో సినిమాను విడుద‌ల చేయించేది లేద‌ని క‌రాఖండిగా చెప్పారంట అక్క‌డి సెన్సార్‌బోర్డు  స‌భ్యులు. స‌న్నీలియోన్ పాట‌ను తొల‌గిస్తే.. విడుద‌ల‌కు ఓకే అని స‌ల‌హా కూడా ఇచ్చారంట‌.  మ‌న‌దేశంతోపాటు, ప్రంపంచ దేశాల యువ‌త శృంగార దేవ‌త‌గా కొలుస్తోన్న స‌న్నీలియోన్‌కు ఇలాంటి ప‌రాభ‌వం ఎదుర‌వడాన్ని పాకిస్తాన్ లోని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఏరికోరి అందాల భామ‌తో తాను స్టెప్పులు వేయించుకున్న పాట‌ను తొల‌గించడం షారూఖ్‌కి ఇష్టం లేదు. పాట‌ను తొల‌గించ వ‌ద్ద‌ని పాకిస్తాన్ నుంచి షారూఖ్‌కి ఫోన్లు వ‌స్తున్నాయట‌. పాట ఉంచితే.. సినిమా విడుద‌ల కాదు.. ఉంచ‌క‌పోతే.. ప్రేక్ష‌కులు రారు. ముందు నుయ్యి..వెన‌క గొయ్యి అంటే ఇదేనేమో అనుకుంటున్నాడు షారూఖ్‌.. మ‌రి స‌న్నీ సాంగ్‌పై షారూఖ్ ఏం నిర్ణ‌యం తీసుకుంటాడా? అన్న ఆస‌క్తి పాకిస్తాన్ అభిమానుల‌ను తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేస్తోంది.