ప్ర‌భుదేవకు భ‌యం ప‌ట్టుకుంద‌ట‌..!

అస‌లు బాడిలో  బోన్స్ ఉన్నాయో లేవో అనే విధంగా డ్యాన్స్ చేయ‌గ‌ల  కొరియో గ్ర‌ఫ‌ర్స్ లో  ఇండియ‌న్ మైకెల్ జాక్స‌న్ ప్ర‌భుదేవ ఒక‌రు. తెలుగులో  ద‌ర్శ‌కుడిగా వ‌చ్చిన అవకాశాల‌తో త‌న స‌త్తా స‌రి కొత్త‌గా చాటుకుని.. బాలీవుడ్ లో యాక్ష‌న్ చిత్రాల్ని డైరెక్ట్ చేసి  అక్క‌డ కూడా  జెండా పాతిన  ద‌క్షిణాది  ఆల్ రౌండ‌ర్ .

 ఆయ‌న ఎన్ని చేసినా.. ప్ర‌భుదేవ అన‌గానే గుర్తుకొచ్చేది కొరియో గ్ర‌ఫినే.  క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవ ఒక బై లింగ్విల్ ఫిల్మ్ చేస్తున్నారు.  అభినేత్రి పేరు తో చేస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్, హింది లాంగ్వేజెస్ లో రానుంది. ఏజ్ రీత్య 44  వ‌సంతాలు నిండిన ప్ర‌భుదేవ‌కు ఈ మ‌ధ్య ఒక భ‌యం ప‌ట్టుకుంద‌ట‌.

అదేమిటంటే.. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది .. త‌ను ముందు ముందు డ్యాన్స్ బాగా చేయ‌లేనేమో అనే వేద‌నట‌.  ఇదీ మ‌రీ విడ్డూరం అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే..వ‌య‌సు పెర‌గ‌డం ఒక స‌హ‌జ ప్ర‌క్రియ‌. ఎప్పుడు య‌వ్వ‌న‌స్తుడిగా వుండే చాన్స్ లేదు క‌దా.  వ‌య‌సు పెరిగిన త‌రువాత‌..  ఆడియ‌న్స్ కూడా అర్ధం చేసుకుంటారు.  పాతికేళ్ల వ‌య‌సులో చేసిన‌ట్లు 50 ఏళ్ల వ‌య‌సులో చేయాల‌ని కోరు కోరు క‌దా.?  అయితే  త‌న స్టైల్ ..మార్క్ ఉందా లేదా అనేది మాత్ర‌మే చూస్తారు. అయినా  అటు టాలీవుడ్ లోను..ఇటు  కోలీవుడ్ లోను  ఎంతో మంది  ప్ర‌భుదేవను  ప్ర్రేర‌ణ గా తీసుకుని  కొరియో గ్రాఫ‌ర్స్ అయిన వాళ్లే.  ఆయ‌న భ‌య ప‌డాల్సింది ఎందుకో ఆయ‌న‌కే తెలియాలి.  ఆయ‌న ఇద్ద‌రి కుమారుళ్లో  ఎవ‌రో ఒక‌రికైనా త‌న వార‌స‌త్వం రాక పోతుందా..? ఎంటో క‌ళాకారులు  ఏజ్  పెరుగుతుంటే దాన్ని  ర‌జ‌నీకాంత్ లా స‌హ‌జ సిద్దంగా స్వీక‌రించ లేక పోతుంటారు. ఇదొక మానసిక  రుగ్మ‌తే క‌దా.!