Telugu Global
Cinema & Entertainment

నాగార్జునతో నటించాలని ఉందా...?

నాగార్జునతో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి… హీరోయిన్లతో పాటు చాలా మంది మన్మధుడితో కలిసి యాక్ట్ చేయాలని కోరుకుంటారు. దీనికి తోడు మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో చాలా మంది ప్రజలకు దగ్గరయ్యాడు నాగార్జున. కాబట్టి వాళ్లు కూడా నాగార్జునతో కలిసి వెండితెరపై కనిపించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల కోసం నాగార్జున ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. తనతో కలిసి నటించాలనుకునే వాళ్లు తనను సంప్రదించవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.  తనతో నటించాలనుకునే వాళ్లు talent@annapurnastudios.com అనే […]

నాగార్జునతో నటించాలని ఉందా...?
X

నాగార్జునతో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి… హీరోయిన్లతో పాటు చాలా మంది మన్మధుడితో కలిసి యాక్ట్ చేయాలని కోరుకుంటారు. దీనికి తోడు మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో చాలా మంది ప్రజలకు దగ్గరయ్యాడు నాగార్జున. కాబట్టి వాళ్లు కూడా నాగార్జునతో కలిసి వెండితెరపై కనిపించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల కోసం నాగార్జున ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. తనతో కలిసి నటించాలనుకునే వాళ్లు తనను సంప్రదించవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. తనతో నటించాలనుకునే వాళ్లు talent@annapurnastudios.com అనే ఈమెయిల్ ఐడీకి… తమ డీటేయిల్స్ పంపించాలని నాగ్ కోరుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న నిర్మలా కాన్వెంట్ చిత్రంలో ప్రత్యేక పాత్రలోకనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి నాగార్జునే నిర్మాత కావడం విశేషం. మరోవైపు హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నాడు. అయితే, నాగార్జున ఇప్పుడు ఇచ్చిన పిలుపు ఈ రెండు చిత్రాల కో్సమా లేదా మరో కొత్త చిత్రం కోసమా అనేది తేలాల్సి ఉంది. అది ఏ చిత్రంలో అయినప్పటికీ… నాగార్జున చెప్పిన మెయిల్ ఐడీకి దరఖాస్తులు వెల్లువెత్తడం మాత్రం ఖాయం. నటించాలని ఆసక్తి , టాలెంట్ ఉన్న అన్ని వయసుల వాళ్లు తనకు మెయిల్ చేయాలని నాగార్జున కోరారు.

First Published:  30 July 2016 1:08 AM GMT
Next Story