Telugu Global
Cinema & Entertainment

కేరళలో గ్యారేజీ పెట్టిన ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అదనంగా మరో 2 వారాల టైం దొరికింది. లెక్కప్రకారం… మరో 2 వారాల్లో అంటే ఆగస్ట్ 12న సినిమాను విడుదల చేయాలి. కానీ షూటింగ్ కాలేదనిచెప్పి సడెన్ గా పోస్ట్ పోన్ చేశారు. తిరిగి సెప్టెంబర్ 2న కలుద్దామని ప్రకటించాడు. సో.. ఆగస్ట్ నెలంతా ఎన్టీఆర్ దే. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా తాపీగా చేసుకోవచ్చు. ప్రస్తుతం తారక్ అదే పనిలో ఉన్నాడు. సినిమా యూనిట్ కేరళ వెళ్లింది. అక్కడ ప్రస్తుతం […]

కేరళలో గ్యారేజీ పెట్టిన ఎన్టీఆర్...
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అదనంగా మరో 2 వారాల టైం దొరికింది. లెక్కప్రకారం… మరో 2 వారాల్లో అంటే ఆగస్ట్ 12న సినిమాను విడుదల చేయాలి. కానీ షూటింగ్ కాలేదనిచెప్పి సడెన్ గా పోస్ట్ పోన్ చేశారు. తిరిగి సెప్టెంబర్ 2న కలుద్దామని ప్రకటించాడు. సో.. ఆగస్ట్ నెలంతా ఎన్టీఆర్ దే. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా తాపీగా చేసుకోవచ్చు. ప్రస్తుతం తారక్ అదే పనిలో ఉన్నాడు. సినిమా యూనిట్ కేరళ వెళ్లింది. అక్కడ ప్రస్తుతం కొన్ని సన్నివేశాలతో పాటు… పాటలకు సంబంధించిన కొంత భాగాన్ని పూర్తిచేస్తున్నారు.

మోహన్‌ లాల్‌ హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో ఉండే జనతా గ్యారేజ్‌ ఓనర్‌గా కనిపిస్తాడు. కేరళ షెడ్యూల్‌తో షూటింగ్‌ పార్టు కంప్లీట్ అవుతుంది. ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌ పాల్గొనే సన్నివేశాలను ఇక్కడే షూట్ చేస్తారు. ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో క్లయిమాక్స్‌ సన్నివేశాలను షూట్ చేసారు. కేరళ నుంచి వచ్చిన వెంటనే ఐటెమ్‌ సాంగ్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తారు. ఐటెంసాంగ్ తో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత… ఆడియో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. తారక్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు డబుల్ అయ్యాయి.

First Published:  30 July 2016 8:30 AM GMT
Next Story