తన రేంజ్ ఏంటో ఒప్పుకున్న కాజల్…

కాజల్ కు ఇన్నాళ్లకు తన రేంజ్ ఏంటో తెలిసొచ్చింది. హఠాత్తుగా తన వయసు గుర్తొచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నాళ్లయిందో గుర్తెరిగింది. ఇంకా మేల్కొనకపోతే మొదటికే మోసం వస్తుందని తెలుసుకుంది. అందుకే ఎంతోమంది నో చెప్పినా… చిరంజీవి సరసన నటించడానికి కాజల్ ఒప్పుకుంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు… కాజల్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. యంగ్ హీరోస్ ఎవరూ ఈమెను పట్టించుకోవట్లేదనే విషయం తెలిసిపోతోంది. ఇది మాత్రమే కాదు… ఇన్నాళ్లూ ఐటెంసాంగ్స్ కు దూరంగా ఉన్న కాజల్.. ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజీలో కూడా ఐటెంసాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. సో… కాజల్ కు తానేంటో ఇప్పుడు అర్థమైంది.

ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోస్ సరసన మాత్రమే నటిస్తానని మొన్నటివరకు మొండికేసి కూర్చుంది. కానీ యంగ్ హీరోస్ పక్కన కాజల్ అప్పట్లోలా సెట్ అవ్వడం లేదనే విషయాన్ని, ఆమె తప్ప అంతా గ్రహించారు. ఇన్నాళ్లకు ఆ విషయాన్ని కాజల్ తాజాగా తెలుసుకుంది. అందుకే చిరంజీవి సరసన నటించడానికి సై అంది. సో… బడా హీరోలందరికీ ఇప్పుడు ఒక ఆప్షన్ దొరికేసింది. వెంకీ కూడా తన నెక్ట్స్ సినిమా కోసం ఎంచక్కా కాజల్ ను సంప్రదించవచ్చు. అటు నాగార్జున, బాలయ్య కూడా కాజల్ తో సినిమాలు చేసేయొచ్చు. అంతే కదా మరి.