Telugu Global
Cinema & Entertainment

తమన్న చెంతకు మరో భారీ ఆఫర్

కరణ్ జోహార్ కు బాలీవుడ్ లో ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా… నిర్మాతగా కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు, హిట్స్ కొడుతున్నాడు. తనకు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రాలు నిర్మించే కరణ్ జోహార్… మిల్కీబ్యూటీకి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. తను తీయబోయే నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలక్ట్ చేశాడు. తెలుగులో హిట్టయిన ఊపిరి సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు కరణ్ జోహార్ రెడీ అవుతున్నాడు. […]

తమన్న చెంతకు మరో భారీ ఆఫర్
X

కరణ్ జోహార్ కు బాలీవుడ్ లో ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా… నిర్మాతగా కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు, హిట్స్ కొడుతున్నాడు. తనకు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రాలు నిర్మించే కరణ్ జోహార్… మిల్కీబ్యూటీకి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. తను తీయబోయే నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలక్ట్ చేశాడు. తెలుగులో హిట్టయిన ఊపిరి సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు కరణ్ జోహార్ రెడీ అవుతున్నాడు. తెలుగు వెర్షన్ లో హీరోయిన్ గా నటించిన తమన్నానే హిందీ వెర్షన్ కోసం కూడా తీసుకున్నాడు. అయితే నాగార్జున, కార్తి పాత్రల్ని ఎవరు పోషిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం తమన్నాకు బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాల్లేవు. చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. బాహుబలి సినిమా డబ్బింగ్ వెర్షన్ మాత్రం ఆమెకు కొంచెం పేరు తెచ్చింది. అంతేతప్ప స్ట్రయిట్ సినిమాతో తమన్నా ఆకట్టుకున్న దాఖలాల్లేవు హిందీలో. అందుకే కనీసం ఊపిరి రీమేక్ తో అయినా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలగొచ్చని భావిస్తోంది మిల్కీబ్యూటీ. కరణ్ జోహార్ నుంచి ఆఫర్ వచ్చిన వెంటనే… హిందీ ప్రాజెక్టులో నటించేందుకు… ఓ స్టార్ హీరో సరసన నటించాల్సిన తమిళ సినిమాను కూడా వదులుకుంది.

First Published:  29 July 2016 11:33 PM GMT
Next Story