Telugu Global
National

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ రామ‌య్య కుమారుడు...బెల్జియంలో మృతి!

క‌ర్ణాటక ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య కుమారుడు రాకేష్ సిద్ధ‌రామ‌య్య (39) శ‌నివారం మ‌ర‌ణించారు. బెల్జియం రాజ‌ధాని బ్ర‌స్సెల్స్‌లో యాంట్‌వెర్ప్ యూనివ‌ర్శిటీ ఆసుప‌త్రిలో  ఎక్యూట్ పాంక్రియాటైటిస్ కి చికిత్స పొందుతూ  ఆయ‌న మృతి చెందారు. శ‌రీరంలో ఇత‌ర అవ‌య‌వాలు ప‌నిచేయ‌టం ఆగిపోవ‌టంతో మ‌ర‌ణించిన‌ట్టుగా తెలుస్తోంది. గ‌త ఆదివారం తీవ్ర‌మైన లివ‌ర్, పాంక్రియాస్ స‌మ‌స్య‌ల‌తో రాకేష్ ఆసుప‌త్రిలో చేర‌గా హెప‌టో రీన‌ల్ సిండ్రోమ్‌తో మూత్ర‌పిండాలు వైఫ‌ల్యం చెందాయి. ఐసియులో ఉంచి డ‌యాలసిస్ అందిస్తూ, ఇత‌ర అవ‌య‌వాలు ఫెయిల్ కాకుండా త‌గిన చికిత్స […]

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ రామ‌య్య కుమారుడు...బెల్జియంలో మృతి!
X

క‌ర్ణాటక ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య కుమారుడు రాకేష్ సిద్ధ‌రామ‌య్య (39) శ‌నివారం మ‌ర‌ణించారు. బెల్జియం రాజ‌ధాని బ్ర‌స్సెల్స్‌లో యాంట్‌వెర్ప్ యూనివ‌ర్శిటీ ఆసుప‌త్రిలో ఎక్యూట్ పాంక్రియాటైటిస్ కి చికిత్స పొందుతూ ఆయ‌న మృతి చెందారు. శ‌రీరంలో ఇత‌ర అవ‌య‌వాలు ప‌నిచేయ‌టం ఆగిపోవ‌టంతో మ‌ర‌ణించిన‌ట్టుగా తెలుస్తోంది. గ‌త ఆదివారం తీవ్ర‌మైన లివ‌ర్, పాంక్రియాస్ స‌మ‌స్య‌ల‌తో రాకేష్ ఆసుప‌త్రిలో చేర‌గా హెప‌టో రీన‌ల్ సిండ్రోమ్‌తో మూత్ర‌పిండాలు వైఫ‌ల్యం చెందాయి. ఐసియులో ఉంచి డ‌యాలసిస్ అందిస్తూ, ఇత‌ర అవ‌య‌వాలు ఫెయిల్ కాకుండా త‌గిన చికిత్స అందించినా ఫ‌లితం లేక‌పోయింది.

రాకేష్ సిద్ధ‌రామ‌య్య‌కు భార్య ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ముఖ్య‌మంత్రి కుటుంబం ఆదివారం బెల్జియం నుండి మృత‌దేహాన్నిప్ర‌త్యేక విమానంలో భార‌త్‌కి తీసుకురానున్న‌ది. అక్క‌డి బార‌త దౌత్య‌కార్యాల‌యం అందుకు సంబంధించిన ప‌నుల్లో స‌హ‌క‌రిస్తోంది. రాకేష్‌కి ఆరోగ్యం బాగాలేద‌ని తెలియ‌టంతో సిద్ధ‌రామ‌య్య గురువారం బెల్జియం వెళ్లారు. ఆయ‌న భార్య పార్వ‌తి, మ‌రో కుమారుడు య‌తీంద్ర‌ అక్క‌డే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్‌కి గుర‌యిన స‌మ‌యంలో రాకేష్ కి పాంక్రియాస్ దెబ్బ‌తింది. అప్ప‌టినుండి ఆయ‌న ఎక్యూట్ పాంక్రియాటైటిస్‌తో బాధ‌ప‌డుతున్నారు. కాగా రాకేష్ బంధువుల ఇంట్లో ఉన్న కుమారుని చూడ‌టానికి ఇటీవ‌ల జ‌ర్మ‌నీ వెళ్లారు. త‌రువాత ఆయ‌న స్నేహితుల‌తో హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బెల్జియంలో ఉండ‌గా తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. రాకేష్ స్నేహితుల ఫేస్‌బుక్ ఎకౌంట్‌లోని వివ‌రాల‌ను బ‌ట్టి వారు బెల్జియం ప‌ట్ట‌ణం బూమ్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచంలోని అతిపెద్ద‌దైన ఎల‌క్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివ‌ల్ టుమారో ల్యాండ్‌ని చూడ‌టానికి వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది.

First Published:  30 July 2016 8:37 AM GMT
Next Story