Telugu Global
Cinema & Entertainment

ఆ సెంటిమెంట్ మాత్రం వదలని మహేష్

సినిమావాళ్లకు సెంటిమెంట్లు కామన్. మహేష్ బాబుకు కూడా అలాంటిదే ఓ సెంటిమెంట్ ఉంది. తను ఏ సినిమాలో నటించినా దాని ప్రారంభోత్సవానికి మాత్రం మహేష్ రాడు. సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేరుగా సెట్స్ పైకి వస్తాడు. డైరక్ట్ గా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. అంతేతప్ప సినిమా ప్రారంబోత్సవానికి మాత్రం మహేష్ రాడు. ఈసారి కూడా మహేష్ అదే సెంటిమెంట్ పాటించాడు. దర్శకుడు మురుగదాస్ తో చేయబోతున్న ప్రతిష్టాత్మక సినిమా ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టాడు. అన్నపూర్ణ […]

ఆ సెంటిమెంట్ మాత్రం వదలని మహేష్
X

సినిమావాళ్లకు సెంటిమెంట్లు కామన్. మహేష్ బాబుకు కూడా అలాంటిదే ఓ సెంటిమెంట్ ఉంది. తను ఏ సినిమాలో నటించినా దాని ప్రారంభోత్సవానికి మాత్రం మహేష్ రాడు. సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేరుగా సెట్స్ పైకి వస్తాడు. డైరక్ట్ గా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. అంతేతప్ప సినిమా ప్రారంబోత్సవానికి మాత్రం మహేష్ రాడు. ఈసారి కూడా మహేష్ అదే సెంటిమెంట్ పాటించాడు. దర్శకుడు మురుగదాస్ తో చేయబోతున్న ప్రతిష్టాత్మక సినిమా ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టాడు. అన్నపూర్ణ స్టుడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి యూనిట్ నుంచి మహేష్ తప్ప అంతా హాజరయ్యారు.

మహేష్ ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ సినిమా కోసం అన్నపూర్ణలో రెండు అంతస్తుల్లో భారీ సెట్స్ వేశారు. ఇందులో మహేష్ నటించగా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. మహేష్ ఇందులో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సన్నివేశాలతో పాటు ఓ పాటకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని కూడా పిక్చరైజ్ చేస్తారు. దీనికోసం కూడా ఇప్పటికే మరో భారీ సెట్ సిద్ధంగా ఉంది. సో… ఈరోజు నుంచి మహేష్ బాబు సినిమా పరుగులుపెట్టబోతోందన్నమాట.

First Published:  30 July 2016 8:18 AM GMT
Next Story