Telugu Global
Cinema & Entertainment

చైతూ సినిమా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్...

సమంతను ప్రేమిస్తున్నాడా లేదా… వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా..చేసుకోరా…? ఇలా చాలా పుకార్ల మధ్య నలిగిపోయాడు నాగచైతన్య. అయితే పుకార్లు ఎన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతం చేస్తున్న తన సినిమాలపై నుంచి మాత్రం దృష్టి మరల్చలేదు. ఎందుకంటే ప్రస్తుతం చైతూ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు అతడి కెరీర్ కు చాలా కీలకమైనవే. వీటిలో ఒక సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “సాహసం శ్వాసగా సాగిపో” అనే సినిమా చేశాడు నాగచైతన్య. […]

చైతూ సినిమా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్...
X

సమంతను ప్రేమిస్తున్నాడా లేదా… వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా..చేసుకోరా…? ఇలా చాలా పుకార్ల మధ్య నలిగిపోయాడు నాగచైతన్య. అయితే పుకార్లు ఎన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతం చేస్తున్న తన సినిమాలపై నుంచి మాత్రం దృష్టి మరల్చలేదు. ఎందుకంటే ప్రస్తుతం చైతూ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు అతడి కెరీర్ కు చాలా కీలకమైనవే. వీటిలో ఒక సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “సాహసం శ్వాసగా సాగిపో” అనే సినిమా చేశాడు నాగచైతన్య. చాలా రోజుల కిందటే ఈ సినిమా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయాలని నిర్ణయించారు. మలయాళ చిత్రసీమకు చెందిన మంజిమా మోహన్… ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.

గతంలో చైతూ-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన “ఏమాయచేశావె” సినిమా సూపర్ హిట్ అయింది. చైతూ కెరీర్ కు బ్రేక్ పాయింట్ గా నిలిచింది ఆ సినిమా. మళ్లీ ఇన్నేళ్లకు గౌతమ్ మీనన్ తో కలిసి మరోసినిమా చేశాడు నాగచైతన్య. ఈ సినిమాతో కెరీర్ లో మరో మెట్టు పైకి ఎక్కాలనుకుంటున్నాడు. కేవలం లవ్ సన్నివేశాలకే పరిమితం కాకుండా… చైతూను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే సినిమాగా “సాహసం శ్వాసగా” మూవీ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

First Published:  29 July 2016 9:00 PM GMT
Next Story