Telugu Global
Cinema & Entertainment

హైపర్ ఓల్టేజ్ తో ముస్తాబవుతున్న రామ్

రామ్ కొత్త సినిమాకు “హైపర్” అనే టైటిల్ పెడుతున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. కొంతమంది ఈ టైటిల్ ను విమర్శిస్తే… మరికొందరు బాగుందని మెచ్చుకున్నారు. ఎట్టేకేలకు రామ్ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ డిజైన్ తో పాటు… ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 3న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలని […]

హైపర్ ఓల్టేజ్ తో ముస్తాబవుతున్న రామ్
X

రామ్ కొత్త సినిమాకు “హైపర్” అనే టైటిల్ పెడుతున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. కొంతమంది ఈ టైటిల్ ను విమర్శిస్తే… మరికొందరు బాగుందని మెచ్చుకున్నారు. ఎట్టేకేలకు రామ్ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ డిజైన్ తో పాటు… ఫస్ట్ లుక్ ను ఆగస్ట్ 3న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. గతంలో రామ్ తో కందిరీగ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన సంతోష్ శ్రీనివాస్,… మరోసారి ఈ హైపర్ ను తెరపైకి తీసుకొస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

నిజానికి రాశీఖన్నా, రామ్ కు కలిసిరాలేదు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివం సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ… ఆ సెంటిమెంట్ ను పక్కనపెట్టి ఆమెకు మరోసారి రామ్ తన సరసన ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాతో రామ్ చరణ్ ను ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాడు రామ్. అవును… చెర్రీ సినిమా ధ్రువ కూడా దసరా బరిలోనే నిలిచింది. ఇప్పుడు రామ్ కూడా రేస్ లోకి ఎంటరయ్యాడు.

First Published:  31 July 2016 1:18 AM GMT
Next Story