Telugu Global
Cinema & Entertainment

లారెన్స్ నుంచి ఇంకో హారర్...

కాంచన, గంగ లాంటి సినిమాలతో సౌత్ లో లారెన్స్ ఎంత పాపులర్ అయిపోయాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ మరో ప్రాజెక్టును పట్టాలపైకి తెస్తున్నాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా ప్రారంభం అవుతోంది. కన్నడలో హిట్టయిన శివలింగ సినిమా రీమేక్ లో లారెన్స్ నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో లారెన్స్ కేవలం హీరో మాత్రమే. ప్రాజెక్టుకు వి.వాసు దర్శకత్వం వహిస్తారు. కన్నడ వెర్షన్ కు కూడా ఈయనే దర్శకుడు. గతంలో చంద్రముఖి […]

లారెన్స్ నుంచి ఇంకో హారర్...
X

కాంచన, గంగ లాంటి సినిమాలతో సౌత్ లో లారెన్స్ ఎంత పాపులర్ అయిపోయాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ మరో ప్రాజెక్టును పట్టాలపైకి తెస్తున్నాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా ప్రారంభం అవుతోంది. కన్నడలో హిట్టయిన శివలింగ సినిమా రీమేక్ లో లారెన్స్ నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో లారెన్స్ కేవలం హీరో మాత్రమే. ప్రాజెక్టుకు వి.వాసు దర్శకత్వం వహిస్తారు. కన్నడ వెర్షన్ కు కూడా ఈయనే దర్శకుడు. గతంలో చంద్రముఖి లాంటి సూపర్ హిట్ సినిమా తీసింది ఈయనే. సో… పి.వాసు-లారెన్స్ కాంబోలో శివలింగ రీమేక్ రాబోతోంది. బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ ఈరోజు మొదలుకానుంది. ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో దీన్ని తెరకెక్కించనున్నారు. మాధవన్ తో సాలా ఖదూస్ సినిమాలో నటించిన రితికా సింగ్… శివగంగ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైంది. తమన్ సంగీతం అందించబోతున్నాడు. కాంచన, గంగ లాంటి సినిమాలతో భయపెట్టి నవ్వించిన లారెన్స్… శివగంగ సినిమాతో ఎలాంటి మేజిక్కులు చూపిస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ కు, లారెన్స్ కు అస్సలు పడదు. గతంలో ప్రభాస్ సినిమా నుంచి అర్థాంతరంగా తమన్ ను తీసేసి పక్కనపెట్టాడు లారెన్స్. ఇప్పుడు తమ సినిమా కోసం అదే తమన్ ను తీసుకోవడం అందర్నీ ఆకర్షించింది. మరి వీళ్ల మధ్య అభిప్రాయబేధాలు తొలిగిపోయాయా… లేక మరోసారి క్రియేటివ్ క్లాషెష్ వస్తాయా అనేది చూడాలి.

First Published:  31 July 2016 9:46 PM GMT
Next Story