Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా బాహుబలి షూటింగ్...

అనుకున్న టైమ్ కంటే ఇప్పటికే కాస్త ఆలస్యంగా నడుస్తోంది బాహుబలి షూటింగ్. క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలతోనే సినిమా రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించారు. ఏకథాటిగా 10 వారాల పాటు యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించాలనుకున్నారు. కానీ మొదటి 3 వారాలు వేస్ట్ అయిపోయాడు. దీంతో మిగిలిన టైమ్ లోనే మొత్తం పార్ట్ పూర్తిచేయాలని బాహుబలి టీం నిర్ణయించుకుంది. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో బాహుబలి పార్ట్-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్-రానా మధ్య […]

శరవేగంగా బాహుబలి షూటింగ్...
X

అనుకున్న టైమ్ కంటే ఇప్పటికే కాస్త ఆలస్యంగా నడుస్తోంది బాహుబలి షూటింగ్. క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలతోనే సినిమా రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించారు. ఏకథాటిగా 10 వారాల పాటు యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించాలనుకున్నారు. కానీ మొదటి 3 వారాలు వేస్ట్ అయిపోయాడు. దీంతో మిగిలిన టైమ్ లోనే మొత్తం పార్ట్ పూర్తిచేయాలని బాహుబలి టీం నిర్ణయించుకుంది. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో బాహుబలి పార్ట్-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్-రానా మధ్య యుద్ధ సన్నివేశాల్ని కొన్ని రోజులుగా తెరకెక్కిస్తున్నారు. మరో 4 రోజుల పాటు ఈ సీన్లు తీయవచ్చని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్టిల్ విడుదల చేయని రాజమౌళి… ఈ ఏడాది చివరి వరకు అదే సీక్రెసీ మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి వీడియోలు లీక్ కాకుండా… ఫొటోలు బయటకు రాకుండా గట్టి చర్యలు చేపట్టారు. లైట్ బాయ్ నుంచి స్టార్ హీరో వరకు అందరూ.. ఎంట్రన్స్ లో మొబైల్ ఫోన్లు ఇచ్చిన తర్వాతే సెట్స్ లోకి అడుగుపెట్టాలనే కండిషన్ పెట్టాడు. దీంతో యూనిట్ సభ్యులెవరూ ఫొటోలు తీసే ఆస్కారం లేదు. ఇక ఎడిట్ రూముల్లో కూడా ప్రత్యేకం పాస్ వర్డ్ ఏర్పాటుచేసి, కేవలం ఒకరిద్దర్ని మాత్రమే బాధ్యులుగా నియమించారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ లో బాహుబలి-2ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. సంక్రాంతి నుంచి ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.

First Published:  2 Aug 2016 4:39 AM GMT
Next Story