పెళ్లి కంటే సినిమాలే బెస్ట్ అనుకుందా..!

అమ‌లాపాల్ అందంగా ఉంటుంది. స్క్రీన్ పై ఆమే బ్యూటీ  ఒక ప్ర‌త్యేక‌మైన ఆక‌ర్ష‌ణ.  కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న‌ప్పుడే  ద‌ర్శ‌కుడు విజ‌య్ తో  ప్రేమ ..  పెళ్లి చేసుకున్నారు. అయితే  ప‌ట్టుమ‌ని  రెండు సంవ‌త్స‌రాలు కూడా అవ్వ‌క ముందే..   ఈ జంట  మ‌ధ్య బేదాభి ప్రాయాలు వ‌చ్చాయి.

ఎందుకు  ..ఏమిటి? అని  కాస్త  లోతుగా  విచారిస్తే..    పెళ్లి త‌రువాత కూడా అమ‌లాపాల్ కు వ‌స్తున్న ఆఫ‌ర్స్  తో ఆమే ఉక్కిరి బిక్కిరి అవుతుంది.   దానికి తోడు  న‌టిగా గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో హీరోయిన్ కు ఏ విధ‌మైన ట్రీట్  మెంట్ .. రియ‌ల్ లైఫ్ లో సెలిబ్రిటిగా ఉండే గుర్తింపు..ఇవ‌న్నీ స్వ‌యంగా అనుభ‌వించిన మ‌నిషి కావ‌డంతో… ఒకేసారి సినిమాకు దూరం కాలేని మాన‌సిక స్థితిలో ఉన్న‌ట్లు కూడా తెలుస్తుంది.   దీనికి తోడు.. త‌న భ‌ర్త విజ‌య్ తో పాటు.. వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్  కూడా   అమ‌లాపాల్ ను   సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని ఒత్తిడి చేస్తుండ‌టంతో…   చివ‌ర‌కు  అమ‌లాపాల్  మ్యారేజ్  కంటే.. సినిమాల‌కే ఓటు వేసిన‌ట్లు తెలుస్తుంది. లేక పోతే  స‌క్సెస్ ఫుల్  డైరెక్ట‌ర్  అయిన విజ‌య్ ను వ‌ద‌లుకోవ‌డానికి  ఇష్ట‌ప‌డుతుందా..?