Telugu Global
Cinema & Entertainment

డబ్బు కోసం నేను అలా చేయను...

హీరోయిన్ గా స‌క్సెస్ కావ‌డం ఒక య‌జ్ఞం. అయిన త‌రువాత స్టార్ డ‌మ్ ను నిల‌పుకోవడం అనేది మ‌హా య‌జ్ఞం . ఏ లాంగ్వేజ్ లో అయిన ఇది కామ‌నే. అయితే చాల మంది హీరోయిన్స్ దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సూత్రాన్ని అప్లై చేస్తుంటారు. ఒక‌టి రెండు హిట్స్ రాగానే .. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని అంగీక‌రించ‌డం చేస్తుంటారు. పారితోష‌కం ఎక్కువ ఇస్తే.. సెకండా థాట్ లేకుండా ఎటువంటి సినిమానైనా అంగీక‌రిస్తారు. కానీ ఇషా గుప్తా […]

డబ్బు కోసం నేను అలా చేయను...
X

హీరోయిన్ గా స‌క్సెస్ కావ‌డం ఒక య‌జ్ఞం. అయిన త‌రువాత స్టార్ డ‌మ్ ను నిల‌పుకోవడం అనేది మ‌హా య‌జ్ఞం . ఏ లాంగ్వేజ్ లో అయిన ఇది కామ‌నే. అయితే చాల మంది హీరోయిన్స్ దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సూత్రాన్ని అప్లై చేస్తుంటారు. ఒక‌టి రెండు హిట్స్ రాగానే .. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని అంగీక‌రించ‌డం చేస్తుంటారు. పారితోష‌కం ఎక్కువ ఇస్తే.. సెకండా థాట్ లేకుండా ఎటువంటి సినిమానైనా అంగీక‌రిస్తారు. కానీ ఇషా గుప్తా మాత్రం ఈ విష‌యంలో తన రూటే స‌ప‌రేటు అంటొంది. కెరీర్‌ ప్రారంభంలో బాగానే పేరు తెచ్చుకున్నా 2014లో నటించిన ‘హమ్‌షకల్‌’ చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఇషా కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోయింది. దాంతో సినిమాల్లో కనిపించడం మానేసింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘రుస్తూం’ చిత్రంలో నటిస్తోంది. మరి ఇంతకాలం ఏం చేశారని అడిగితే.. చాలా విషయాలు మీడియాకు చెప్పుకొచ్చింది ఈ భామ.

నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలి ఏడాదే ‘జన్నత్‌-2’.. ‘రాజ్‌-3’.. ‘చక్రవ్యూహ్‌’లలో వరసగా నటించాను. బహుశా అందువల్లే ఒక్క సినిమా ఫ్లాప్‌ అవ్వగానే నా కెరీర్‌ వెనకబడిపోయింది. అయినా నాకు సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి. అయితే పారితోషికం బాగా ఇచ్చినా… మంచి కధ ఉన్న‌ సినిమాలు కాకపోయినా, నా అభిరుచికి తగ్గ సినిమాలు కాకపోయిన నేను నటించను. నన్ను నేను తెరపై చూడొద్దనుకునే పాత్రల్లో నేను నటించను. డబ్బులు సంపాదించాలనుకుంటే అందుకు చాలా మార్గాలున్నాయి. అంతేగానీ.. డబ్బుకోసం చెత్త సినిమాలో నటించాల్సిన అవసరమేముంది? ‘రుస్తూం’లో అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా. ఈ చిత్రం మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం.

First Published:  2 Aug 2016 3:59 AM GMT
Next Story