సరిగ్గా ఈ రోజుకు ఇంకా నెల రోజులు

జనతా గ్యారేజ్ కు అసలైన కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రారంభమైంది. సరిగ్గా ఈ రోజుకు ఇంకా నెల రోజులు మాత్రం టైం ఉంది. అవును.. ఈ రోజు ఆగస్ట్ 2. సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించారు. కాబట్టి… ఈరోజు నుంచి నెల రోజుల్లో జనత గ్యారేజీ థియేటర్లలోకి రావాలి. ఇప్పటికే ఒకసారి ఈ సినిమాను వాయిదావేశారు. మరోసారి వాయిదా అంటూ ప్రకటిస్తే… ఈసారి అభిమానులు ఊరుకోరు. అభిమానుల సంగతి అటుంచితే సినిమాపై నెగెటివ్ ఫీడింగ్ ప్రారంభమౌతుంది.

ప్రస్తుతం జనతా గ్యారేజ్ టీం కేరళలో ఉంది. ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సమంత తన భాగం పూర్తిచేసింది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా బయటకు వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమా అటు సమంతకు, ఇటు తారక్ కు ఇద్దరికీ… 26వ సినిమా కావడం విశేషం. పైగా… ఇదే సమంతకు ఆఖరి చిత్రం అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.