Telugu Global
Cinema & Entertainment

బాల‌కృష్ణ న‌మ్మ‌కం  నిజం అవుతుందా..?

తండ్రి నంద‌మూరి తార‌క‌రామ‌రావు న‌ట వార‌సుడిగా  వ‌చ్చిన  బాలకృష్ణ   గొప్ప న‌టుడు అయితే కాలేదు కానీ..   అభిమానుల అండ దండ‌ల‌తో   మంచి మాస్ హీరో గా  స‌క్సెస్ అయ్యారు. ఇక ఆయ‌న త‌నయుడు మోక్ష‌జ్ఙ ను    హీరోగా   ఈ యేడాది ప‌రిచ‌యం చేస్తాన‌ని  ప్ర‌క‌టించ‌డంతో..    ఈ మ‌ధ్య పిల్మ్  న‌గ‌ర్ లో అనేక ర‌కాలైన వార్త‌లు  చెక్క‌ర్లు కొడుతున్నాయి.  ముందు రాజ‌మౌళి తో  బాల‌య్య త‌న‌యుడిని ప‌రిచ‌యం చేస్తార‌నే టాక్ వినిపించింది. అయితే తాజాగా వినిపిస్తున్న స‌మాచారం […]

బాల‌కృష్ణ న‌మ్మ‌కం  నిజం అవుతుందా..?
X

తండ్రి నంద‌మూరి తార‌క‌రామ‌రావు న‌ట వార‌సుడిగా వ‌చ్చిన బాలకృష్ణ గొప్ప న‌టుడు అయితే కాలేదు కానీ.. అభిమానుల అండ దండ‌ల‌తో మంచి మాస్ హీరో గా స‌క్సెస్ అయ్యారు. ఇక ఆయ‌న త‌నయుడు మోక్ష‌జ్ఙ ను హీరోగా ఈ యేడాది ప‌రిచ‌యం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో.. ఈ మ‌ధ్య పిల్మ్ న‌గ‌ర్ లో అనేక ర‌కాలైన వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. ముందు రాజ‌మౌళి తో బాల‌య్య త‌న‌యుడిని ప‌రిచ‌యం చేస్తార‌నే టాక్ వినిపించింది.

అయితే తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ఏమిటంటే.. స్టార్ ద‌ర్శ‌క ర‌చ‌య‌త త్రివిక్ర‌మ్ తో లాంచ్ చేయిస్తే మోక్ష‌జ్ఙ కు మంచి మేలు జ‌రుగుతుంద‌నే ఆలోచ‌న‌లో బాల‌య్య వున్న‌ట్లు స‌మాచారం వినిపిస్తుంది. ప్ర‌స్తుతం బాల‌య్య వందో సినిమాకు మోక్ష‌జ్ఞ స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తూ న‌ట‌న‌లో మెలుకువ‌లు కూడా నేర్చుకుంటున్నాడ‌ట‌. అయితే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ బాధ్య‌త‌ను తీసుకుంటాడా అనేది ప్ర‌శ్నార్ధ‌కం. స్టార్ హీరో త‌న‌యుడంటే అభిమానుల్లో అంచ‌నాలుంటాయి. స్క్రిప్ట్ విష‌యంలో ద‌ర్శ‌కుడిగా పూర్తి స్వేచ్చ కుద‌ర‌దు. ఇత్యాది కార‌ణాల రిత్య త్రివిక్ర‌మ్ ఆ ఆఫ‌ర్ కు దూరంగా ఉండే అవ‌కాశం లేక‌పోలేద‌నే టాక్ కూడా వినిపిస్తుంది మ‌రి.

First Published:  2 Aug 2016 11:35 AM GMT
Next Story