Telugu Global
Cinema & Entertainment

మహేష్ తో నా సినిమా కచ్చితంగా వస్తుంది..

ఊపిరి సినిమాతో తాజాగా హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి చెబుతున్న మాటిది. నిజానికి మహేష్ తో ఎప్పుడో సినిమా చేయాల్సిన దర్శకుడు ఇతను. గతంలో వినిపించిన స్టోరీలైన్స్ మహేష్ కు నచ్చినప్పటికీ… ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఊపిరి సక్సెస్ తర్వాత మరోసారి మహేష్ తో సినిమా చేసేందుకు వంశీ పైడిపల్లి సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో మహేష్ బాబు మరోసారి కొరటాలతో కలిసి సినిమా చేసేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ […]

మహేష్ తో నా సినిమా కచ్చితంగా వస్తుంది..
X

ఊపిరి సినిమాతో తాజాగా హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి చెబుతున్న మాటిది. నిజానికి మహేష్ తో ఎప్పుడో సినిమా చేయాల్సిన దర్శకుడు ఇతను. గతంలో వినిపించిన స్టోరీలైన్స్ మహేష్ కు నచ్చినప్పటికీ… ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఊపిరి సక్సెస్ తర్వాత మరోసారి మహేష్ తో సినిమా చేసేందుకు వంశీ పైడిపల్లి సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో మహేష్ బాబు మరోసారి కొరటాలతో కలిసి సినిమా చేసేందుకు ప్లాన్ రెడీ చేశాడు.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మైత్రీమూవీస్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో రెండో సినిమా చేయబోతున్నాడు. కొరటాల శివ ప్రాజెక్ట్ తెరపైకి రావడంతో… ఇక వంశీ పైడిపల్లి సినిమా ఉండదని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

మహేష్ తో తన సినిమా వచ్చే ఏడాది కచ్చితంగా ఉంటుందంటున్నాడు వంశీ పైడిపల్లి. కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే తన సినిమా సెట్స్ పైకి వస్తుందని కూడా చెబుతున్నాడు. ఇప్పటికే మహేష్ కు వినిపించిన స్టోరీలైన్ అతడికి బాగా నచ్చిందని, ప్రస్తుతం ఆ సినిమా స్క్రీన్ ప్లే రాసే పనిలో బిజీగా ఉన్నానని వంశీ పైడిపల్లి స్పష్టంచేశాడు. సో… మహేష్ నుంచి వరుసగా రాబోయే 3 సినిమాలు ఏంటనేది కన్ ఫర్మ్ అయిపోయాయన్నమాట

First Published:  2 Aug 2016 12:41 AM GMT
Next Story