Telugu Global
NEWS

బీజేపీలో లుక‌లుక‌లు తీరేనా?

తెలంగాణ బీజేపీలో ఇంకా లుక‌లుక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. బ‌య‌టికి క‌నిపించ‌కున్నా.. పార్టీ నాయ‌కుల మ‌ధ్య తీవ్ర అగాథం నెల‌కొంద‌ని కార్య‌క‌ర్త‌లే చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి – గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ఉన్నాయి. ఇక కిష‌న్‌రెడ్డి- నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి మ‌ధ్య విభేదాలు స‌రేస‌రి. ఈ ఇద్ద‌రి విష‌యంలో కిష‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేద‌ని సొంత‌పార్టీ నేత‌లే అంటున్నారు. రాజాసింగ్‌కు టికెట్ […]

బీజేపీలో లుక‌లుక‌లు తీరేనా?
X
తెలంగాణ బీజేపీలో ఇంకా లుక‌లుక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. బ‌య‌టికి క‌నిపించ‌కున్నా.. పార్టీ నాయ‌కుల మ‌ధ్య తీవ్ర అగాథం నెల‌కొంద‌ని కార్య‌క‌ర్త‌లే చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి – గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ఉన్నాయి. ఇక కిష‌న్‌రెడ్డి- నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి మ‌ధ్య విభేదాలు స‌రేస‌రి. ఈ ఇద్ద‌రి విష‌యంలో కిష‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేద‌ని సొంత‌పార్టీ నేత‌లే అంటున్నారు. రాజాసింగ్‌కు టికెట్ కేటాయింపు ద‌గ్గ‌ర నుంచి ఎమ్మెల్యేగా గెలిచేదాకా కిష‌న్ రెడ్డి వ‌ర్గం కావాల‌ని త‌మ‌ను ఇబ్బంది పెట్టింద‌ని రాజాసింగ్ వ‌ర్గం ఆరోపిస్తోంది. కేంద్ర‌మంత్రులు వ‌చ్చి గోషామ‌హ‌ల్‌లో స‌భ‌లు పెట్టినా.. స్థానిక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు క‌నీస స‌మాచారం అందించ‌లేద‌ని కిష‌న్ రెడ్డిపై భ‌గ్గుమంటున్నారు. అందుకే, గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను శివ‌సేన‌, టీఆర్ ఎస్‌లో చేర‌తాన‌ని, లేదా కొత్త పార్టీ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించాడు రాజాసింగ్‌.
ఈ విష‌యం అలా ఉంచితే..పాల‌మూరు ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా మ‌హబూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న చేప‌ట్టాడు కిష‌న్ రెడ్డి. అక్క‌డ కూడా ఇదే ప‌రిస్థితి. త‌న జిల్లాకు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌లేద‌ని కిష‌న్ రెడ్డి వ‌ర్గంపై మండిప‌డింది నాగం వ‌ర్గం. అప్ప‌టి నుంచి ఈ ఇద్ద‌రినేత‌ల మ‌ధ్య దూరం చాలా పెరిగింది. నాగం ఏకంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణ బ‌చావో పేరిట సొంతంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి కిష‌న్ రెడ్డి త‌ప్పుకున్నాకే.. ఆయ‌న పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టారు.
కేంద్రంలో టీఆర్ ఎస్‌- బీజేపీ దోస్తీ చేస్తాయ‌న్న ప్ర‌చారం వ‌చ్చిన‌ ప్రతిసారీ.. రాష్ట్రంలోనూ చేతులు క‌లుపుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం ప్ర‌కారం.. టీఆర్ ఎస్ ఎంపీల‌కు రెండు కేంద్ర‌మంత్రులు – రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి ప‌ద‌వులు ఇస్తారు. ఈ మంత్రి ప‌ద‌వుల పేర్ల‌లో ఎన్వీఎస్ ప్ర‌భాక‌ర్‌, ల‌క్ష్మ‌ణ్ పేరు వినిపిస్తున్నాయి. వీటిపై పార్టీలోని మ‌రో వ‌ర్గం అడ్డుపుల్ల వేస్తోంద‌ని స‌మాచారం. వీరిద్ద‌రూ అధికార పార్టీని విమ‌ర్శించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌ని ఆరోపిస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఉన్న లుక‌లుక‌లు మోదీ ప‌ర్య‌ట‌న‌తోనైనా తీరుతాయో లేదో త్వ‌ర‌లోనే తేలిపోనుంది.
First Published:  2 Aug 2016 7:47 PM GMT
Next Story