Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు ఆగస్ట్ కనెక్షన్

మిగతా హీరోల సంగతి అటుంచితే… మహేష్ కు మాత్రం ఆగస్ట్ లో బలమైన సంబంధం ఉంది. ఆగస్ట్ లోని ప్రతి వారంతో మహేష్ కు లింక్ ఉంది. ఇందులో ప్రధానంగా మహేష్ పుట్టినరోజు కూడా ఉంటే… ఆయన కెరీర్ లోనే హిట్ సినిమాగా నిలిచిన శ్రీమంతుడు కూడా ఆగస్ట్ లోనే ఉఁడడం విశేషం. ఇక మిగతా ఆగస్ట్ విశేషాలు కూడా చూసేయండి.. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు. అభిమానులకు పండగరోజు. ఇక ఈ ఏడాది కూడా అదేవిధంగా […]

మహేష్ బాబు ఆగస్ట్ కనెక్షన్
X
మిగతా హీరోల సంగతి అటుంచితే… మహేష్ కు మాత్రం ఆగస్ట్ లో బలమైన సంబంధం ఉంది. ఆగస్ట్ లోని ప్రతి వారంతో మహేష్ కు లింక్ ఉంది. ఇందులో ప్రధానంగా మహేష్ పుట్టినరోజు కూడా ఉంటే… ఆయన కెరీర్ లోనే హిట్ సినిమాగా నిలిచిన శ్రీమంతుడు కూడా ఆగస్ట్ లోనే ఉఁడడం విశేషం. ఇక మిగతా ఆగస్ట్ విశేషాలు కూడా చూసేయండి..
ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు. అభిమానులకు పండగరోజు. ఇక ఈ ఏడాది కూడా అదేవిధంగా మహేష్ పుట్టినరోజుతో పాటు మరికొన్ని ప్రత్యేక రోజులను కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. ఆగష్టు 7వ తేదీన మహేష్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘శ్రీమంతుడు’ సినిమా ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఇక ఆగష్టు 10న అతడు సినిమా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. మరోవైపు ఆగష్టు 11న అర్జున్ సినిమా పుష్కరం పూర్తిచేసుకోనుంది. అంటే 12 ఏళ్లు కంప్లీట్ చేసుకోబోతోందన్నమాట. ఇలా వీటన్నింటినీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. వీటితో పాటు ఆగస్ట్ 31న మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు కూడా ఉండడంతో… మహేష్ ఫ్యాన్స్ కు ఆగస్ట్ వెరీ వెరీ స్పెషల్ అయిపోయింది.
First Published:  3 Aug 2016 2:20 AM GMT
Next Story