Telugu Global
Cinema & Entertainment

బాహుబలి మోత మొదలైంది...

బాహుబలి-2 సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. దాదాపు ఈ ఏడాదంతా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-బిజినెస్ మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది బయ్యర్లు ఈ సినిమా హక్కులు దక్కించుకునేేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ రేటు ఇంకా పెరిగిపోతుందని కాబట్టి… వచ్చే ఏడాది విడుదలకాబోతున్న ఈ సినిమాను ఇప్పుడే దక్కించుకోవాలనే తాపత్రయం అందరిలో కనిపిస్తోంది. ఇందులో భాగంగా బాహుబలి-2 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం… […]

బాహుబలి మోత మొదలైంది...
X

బాహుబలి-2 సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. దాదాపు ఈ ఏడాదంతా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-బిజినెస్ మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది బయ్యర్లు ఈ సినిమా హక్కులు దక్కించుకునేేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ రేటు ఇంకా పెరిగిపోతుందని కాబట్టి… వచ్చే ఏడాది విడుదలకాబోతున్న ఈ సినిమాను ఇప్పుడే దక్కించుకోవాలనే తాపత్రయం అందరిలో కనిపిస్తోంది. ఇందులో భాగంగా బాహుబలి-2 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా తమిళ హక్కుల్ని ఈసారి ఏకంగా 45కోట్ల రూపాయలకు అమ్మేసినట్టు చెబుతున్నారు. అయితే కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమేకాకుండా… ఇందులోనే తమిళ శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు.

బాహుబలి పార్ట్-1ను యూవీ క్రియేషన్స్ బ్యానర్… తమిళ్ లో విడుదల చేసింది. మంచి లాభాలు కళ్లజూసింది. కానీ పార్ట్-2కు వచ్చేసరికి పోటీ ఎక్కువైపోయింది. ఎంతోమంది రేసులోకి దిగారు. భారీ మొత్తాలు కోట్ చేశారు. దీంతో యూవీ క్రియేషన్స్ వాళ్లు తప్పుకున్నారు. అలా దాదాపు నెల రోజులకు పైగా సాగిన కసరత్తులో భాగంగా…. చివరకు ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ… బాహుబలి-2 రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకుంది. మరో 2 నెలల్లో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను అమ్మబోతున్నారు.

First Published:  3 Aug 2016 10:39 PM GMT
Next Story