17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…! 

తెర‌మీద  హీరోయిన్స్  ఎంతో  అందంగా ..హుషారుగా  ఎప్పుడూ ఆనందానికి  ప్ర‌తీక అన్న‌ట్లుంటారు.  కానీ అంద‌రి జీవితాలు  రియ‌ల్ లైఫ్ లో  అంత అందంగా ఉండ‌వు. ఒక సినిమా క‌థ‌కు  మించి  మ‌లుపులు .. బాధ‌లు .. భావోద్వేగాలుంటాయి. అటువంటి  వ్య‌క్తుల కెట‌గిరికి చెందిన న‌టిమ‌ణుల్లో గౌత‌మి ఒక‌రు.  వైజాక్ కు చెందిన గౌత‌మి త‌న పేరెంట్స్ మాదిరే   డాక్ట‌ర్ కావాల‌నుకున్నారు. కానీ  సినిమా అవ‌కాశాలు రావ‌డం..తెలుగులో   శ్రీ‌నివాస క‌ళ్యాణం  చిత్రం  త‌రువాత వెన‌క్కు తిరిగి చూసుకునే అవ‌స‌రం రాలేదు. ఆ త‌ర్వాత తెలుగు, మ‌ళ‌యాల  లాంగ్వేజె స్ లో కూడా  గౌత‌మి బిజీ అయ్యారు.
అయితే  హీరోయిన్ గా  బిజీగా ఉన్న‌ప్పుడే   వివాహాం చేసుకుని  సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు.  ఒక పాప పుట్టిన త‌రువాత‌.. వైవాహికి జీవితంలో ఎన్నో అప్ప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు.  చివ‌ర‌కు  క్యాన్స‌ర్ బారిన ప‌డి చాలా  తీవ్ర‌మైన  ఆనారోగ్య స‌మ‌స్య‌ను  ఎదుర్కొన్నారు.  చివ‌ర‌కు క‌మ‌ల్ హాస‌న్ తో క‌ల‌సి వుంటూ ఇప్పుడు  త‌నదైన జీవితం   గ‌డుపుతున్నారు.   ఏమైతేనేమి  గౌత‌మి  ఆన్ స్క్రీన్ క‌నిపించ‌క దాదాపు  17 సంవ‌త్స‌రాలు అయ్యింది.   చాలా లాంగ్ గ్యాపే.  
తాజాగా   వైవిధ్య‌మైన చిత్రాలు చేసే ద‌ర్శ‌కుడిగా పేరున్న చంద్ర శేఖ‌ర్ యేలేటి   మ‌న‌మంతా అనే ఒక చిత్రం చేశారు. ఒక మిడిల్ క్లాస్  జంట  ..వారి  యాంబిష‌న్స్..వారి డ్రీమ్స్..   అటువంటి క‌థాంశంతో చేసిన ఈ చిత్రం  శుక్ర‌వారం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో  మోహాన్ లాల్ భార్య రోల్  చేశారు. ఇందులో  ఇద్ద‌రు పిల్ల‌ల‌కు  త‌ల్లి రోల్ చేశారు. ఆ క్యారెక్ట‌ర్ లో అమ్మ‌త‌న్నాని  బాగా అస్వాదించానంటున్నారు  గౌత‌మి.   మ‌న‌మంత చిత్రం  మ‌ల‌యాళంలో కూడా రిలీజ్ అవుతుంది.   మ‌రి లాంగ్ గ్యాప్ త‌రువాత వ‌స్తున్న గౌత‌మి సినిమా చూడ‌టానికి సిద్దంగా ఉండండి.