Telugu Global
NEWS

కేసీఆర్ కు 24 గంట‌లైనా మిగ‌ల‌ని ఆనందం!

ఎర్ర‌వ‌ల్లి, పెన్ ప‌హాడ్ గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ను ప‌క్క‌న‌బెట్టారు. భూములు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చారు. ప్ర‌తిప‌క్షాల‌ను మాగ్రామంలోకి అడుగు పెట్ట‌నివ్వ‌మ‌ని తీర్మానించారు. ఈ మేర‌కు ఊరి పొలిమేర‌ల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అస‌లే వీసీల నియామకం, ఎంసెట్ -2 లీకేజీల‌తో స‌తమ‌త‌మ‌వుతున్న కేసీఆర్‌కు ఈ విష‌యం కాస్త ఊర‌ట‌నిచ్చింది. భూముల రిజిస్ర్టేష‌న్ పూర్తికావ‌డంతో ఒక స‌మ‌స్య తీరిపోయింద‌ని ఊపిరి పీల్చుకునేలోపే కోర్టు తీర్పు రూపంలో భారీ షాక్ త‌గిలింది. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఆందోళ‌న ముగిసింద‌న్న ఆనందం క‌నీసం […]

కేసీఆర్ కు 24 గంట‌లైనా మిగ‌ల‌ని ఆనందం!
X
ఎర్ర‌వ‌ల్లి, పెన్ ప‌హాడ్ గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ను ప‌క్క‌న‌బెట్టారు. భూములు ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చారు. ప్ర‌తిప‌క్షాల‌ను మాగ్రామంలోకి అడుగు పెట్ట‌నివ్వ‌మ‌ని తీర్మానించారు. ఈ మేర‌కు ఊరి పొలిమేర‌ల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అస‌లే వీసీల నియామకం, ఎంసెట్ -2 లీకేజీల‌తో స‌తమ‌త‌మ‌వుతున్న కేసీఆర్‌కు ఈ విష‌యం కాస్త ఊర‌ట‌నిచ్చింది. భూముల రిజిస్ర్టేష‌న్ పూర్తికావ‌డంతో ఒక స‌మ‌స్య తీరిపోయింద‌ని ఊపిరి పీల్చుకునేలోపే కోర్టు తీర్పు రూపంలో భారీ షాక్ త‌గిలింది. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఆందోళ‌న ముగిసింద‌న్న ఆనందం క‌నీసం 24 గంట‌లైనా ఉండ‌క‌పోవ‌డం కేసీఆర్ ప్ర‌భుత్వానికి మింగుడుప‌డ‌టం లేదు. ఇప్పుడేం చేయాలా? అన్న దానిపై న్యాయ‌నిపుణుల‌తో ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. రివ్యూ పిటిష‌న్ వేసేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది.
ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో స‌ర్కారు!
వ‌రుస విప‌త్తులు చుట్టుముడుతున్న వేళ తెలంగాణ స‌ర్కారు ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిని అవ‌లంబిస్తోంది. ఓవైపు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌, ఎంసెట్‌-2 లీకేజీ, వీసీల నియామకం, తాజాగా జీవో నెంబ‌రు 123ను కొట్టివేసిన హైకోర్టు ఇలా స‌మ‌స్య‌ల‌న్నీ ప్ర‌భుత్వాన్ని న‌లువైపులా చుట్టుముట్టాయి. ఏం చేయాలో తెలియ‌ని స‌ర్కారు.. వేచిచూసే ధోర‌ణి అవ‌లంభిస్తోంది. అందుకే, వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తోంది. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఉంది. ఈ సమ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించి వివాదాన్ని మ‌రింత పెంచ‌డం కేసీఆర్‌కు ఇష్టం లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. పైగా ప్ర‌తిప‌క్ష పార్టీల్లో అంద‌రికంటే ఎక్కువ‌గా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తోంది బీజేపీనే. దీంతో ఒక‌రిని విమ‌ర్శించినా.. అది బీజేపీని కూడా క‌లిపి విమ‌ర్శించిన‌ట్లే అవుతుంది. అందుకే, ఈ వివాదంపై మాట్లాడేందుకు హ‌రీశ్ రావు త‌ప్ప ఇంకెవ‌రూ ముందుకు రావ‌డం లేదు. అది కూడా జీవోపై మాట్లాడుతున్నారే గానీ, ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌డం లేదు.
First Published:  3 Aug 2016 11:07 PM GMT
Next Story