Telugu Global
Cinema & Entertainment

సూర్య సరసన శైలజ

రామ్ నటించిన నేను శైలజ సినిమా ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా పాత్ర ఉంది. ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే నేను శైలజ సినిమా తర్వాత కీర్తి సురేష్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. మహేష్-మురుగదాస్ సినిమాలో ఆమెను తీసుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ.. అది వర్కవుట్ కాలేదు. తెలుగుతెరకు దూరమైనప్పటికీ… ఈ అమ్మడు తమిళనాట మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే హీరో ధనుష్ తో […]

సూర్య సరసన శైలజ
X

రామ్ నటించిన నేను శైలజ సినిమా ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా పాత్ర ఉంది. ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే నేను శైలజ సినిమా తర్వాత కీర్తి సురేష్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. మహేష్-మురుగదాస్ సినిమాలో ఆమెను తీసుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ.. అది వర్కవుట్ కాలేదు. తెలుగుతెరకు దూరమైనప్పటికీ… ఈ అమ్మడు తమిళనాట మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే హీరో ధనుష్ తో ఓ సినిమా చేసింది. ఆ మూవీ ఈ నెలలోనే విడుదలకానుండగా…. విజయ్ 60వ చిత్రంలో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది. విజయ్, ధనుష్ సినిమాలతో పాటు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది కీర్తి సురేష్. తమిళ స్టార్ హీరో సూర్య త్వరలో చేయబోయే సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎఁపికైనట్టు తెలుస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ ఛాన్స్ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమా ఛాన్స్ కూడా వరిస్తే… తమిళనాట కీర్తిసురేష్ రేసులోకి రావడం ఖాయం.

First Published:  3 Aug 2016 10:19 PM GMT
Next Story