రైలు ప్రమాదం- పరిటాల సునీత కుటుంబంలో విషాదం

మంత్రి పరిటాల సునీత కుటుంబంలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని పరిటాల సునీత మేనమామ కుమారుడు గిరీష్ నాయుడు మృతి చెందారు. అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లి దగ్గర బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పరిటాల సునీత బంధువు గిరీష్‌ నాయుడితో పాటు మరో వ్యక్తి కూడా చనిపోయారు.

 paritala familyగిరీష్‌ నాయుడు (31), గుంటూరు జిల్లాకు చెందిన అరవిందకుమార్‌ (30) రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. గిరీష్‌ నాయుడు సైట్‌ కోఆర్డినేటర్‌ కాగా.. అరవిందకుమార్‌ ఫైబర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌.  వీరిద్దరూ బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రూట్‌ సర్వేకు వెళ్లారు. రైల్వేలైన్‌ మీదుగా కేబుల్‌ తీసుకెళ్లాల్సి  ఉండడంతో  ప్రసన్నాయపల్లి సమీపంలోని రైల్వే ఐరన్‌ బ్రిడ్జ్‌పైకి వెళ్లారు. కేబుల్ ఎలా తీసుకెళ్లాలన్న దానిపై పరిశీలన చేస్తున్న సమయంలోనే రైలు వచ్చింది. ఐరన్‌ బ్రిడ్జ్‌పై నుంచి ఎటూ తప్పించుకునేందుకు వీలులేకపోయింది. దీంతో వారిని రైలు ఢీకొట్టింది. అయితే గురువారం తెల్లవారుజాము వరకు దీన్ని ఎవరూ గమనించలేదు. కుటుంబసభ్యులు పదేపదే ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆఫీస్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. రూట్ సర్వేకు వెళ్లిన విషయం తెలుసుకుని ఐరన్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి గాలించారు. అప్పటికే గిరీష్‌ నాయుడు, అరవింద్ కుమార్ రైలు పట్టాలపైనే చనిపోయి ఉన్నారు. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లే రైలు వీరిని ఢీకొన్నట్టు భావిస్తున్నారు.

Click on Image to Read:

amaravathi central pollution control board

chandrababu naidu

modi

l ramana

Sadguru Jaggi Vasudev chandrababu naidu

jc-diwakar-reddy

gottipati

undavalli

devineni nehuruAlso Read:

త‌మ‌న్నా దృష్టి ఎప్పుడు దాని పైనే..!

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

tdp media

sujana chowdary

anam vivekananda reddy