Telugu Global
NEWS

మన గురించి చర్చ లేదేంటి?

రాజకీయాల్లో విజయవంతంగా ముందుకుసాగుతున్నారు అన్న దానికి రెండే కొలమానాలు. ఒకటి ప్రత్యర్థులు బాగా తిట్టడమైనా జరుగుతుండాలి… లేదంటే వివిధ వర్గాల నుంచి ప్రశంసలైనా వస్తూ ఉండాలి. మొత్తానికి లీడర్ మీద చర్చ జరుగుతూ ఉండాలి. అప్పుడే సదరు నాయకుడు విజయవంతమవుతున్నట్టు లెక్క. ఈ ఈక్వేషన్‌ ఆధారంగానే నటుడు, జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ తనను తాను బేరీజు వేసుకుంటున్నారట. ఎన్నికల్లో టీడీపీ- బీజేపీకి మద్దతు పలికిన పవన్… అధికారంలోకి వచ్చి టీడీపీ తప్పు చేస్తే ప్రజల తరపున […]

మన గురించి చర్చ లేదేంటి?
X

రాజకీయాల్లో విజయవంతంగా ముందుకుసాగుతున్నారు అన్న దానికి రెండే కొలమానాలు. ఒకటి ప్రత్యర్థులు బాగా తిట్టడమైనా జరుగుతుండాలి… లేదంటే వివిధ వర్గాల నుంచి ప్రశంసలైనా వస్తూ ఉండాలి. మొత్తానికి లీడర్ మీద చర్చ జరుగుతూ ఉండాలి. అప్పుడే సదరు నాయకుడు విజయవంతమవుతున్నట్టు లెక్క. ఈ ఈక్వేషన్‌ ఆధారంగానే నటుడు, జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ తనను తాను బేరీజు వేసుకుంటున్నారట.

ఎన్నికల్లో టీడీపీ- బీజేపీకి మద్దతు పలికిన పవన్… అధికారంలోకి వచ్చి టీడీపీ తప్పు చేస్తే ప్రజల తరపున తానే ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు పాత పద్దతిలోనే జనాన్ని, రైతులకు వెంటాడడం మొదలుపెట్టారు. దీంతో అందరూ తొలుత పవన్ కల్యాణ్ వైపే చూశారు. పవన్ ప్రశ్నిస్తే బాబు భయపడుతారని అనుకున్నారు. మొదట్లో జనం నుంచి ఒత్తిడి, మీడియాలో చర్చలు చూసి తప్పనిసరిపరిస్థితుల్లో ట్వీట్టర్‌లో అప్పుడప్పుడు ట్వీట్ వేసేవారు. ఒకసారిరాజధాని రైతుల వద్దకు వెళ్లి పెరుగన్నం కూడా తిని వచ్చారు. ఆ సమయంలో పవన్ గురించి విపరీతమైన ప్రచారం జరిగేది. సమస్య వస్తే పవన్ ప్రశ్నించాలి అని అందరూ నినదించేవారు. దీంతో పవన్‌ తో పాటు ఆయన అభిమానులు కూడా ఈ ట్రెండ్ చూసి లోలోన సంబరపడ్డారు. తమ నాయకుడిపై జనానికి చాలా నమ్మకం ఉందనుకున్నారు.

కానీ కాపు ఉద్యమం సమయం నుంచి కథ అడ్డం తిరిగింది. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు వెంటాడి అణచివేస్తున్నా అదే కులానికి చెందిన పవన్ ఎక్కడా ప్రశ్నించలేదు. ట్వీట్‌కూడా లేదు. దాంతో అప్పటి నుంచి పవన్‌పై జనానికి నమ్మకం సన్నగిల్లింది. సొంత సామాజికవర్గాన్నే ఉద్దరించలేని వ్యక్తి ఇక మమ్మల్ని ఏం ఉద్దరిస్తారని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. తాజాగా కేంద్రం ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పిన నేపథ్యంలో అందరూ తిరిగి ప్రశ్నించాలని కోరుతారని పవన్ బృందం భావించింది. కానీ ఎక్కడా అది జరగలేదు. సీపీఐ నాయకులు కొందరు చంద్రబాబును తిట్టలేక పవన్‌ను నిలదీశారే తప్ప జనం గానీ, ప్రతిపక్షాలు గానీ పవన్‌ గురించి అస్పలు పట్టించుకోలేదు. ఈ పరిణామం పవన్‌ను కలవరపరిచిందంటున్నారు. జనం పవన్ కోసం ఎదురుచూడకపోవడానికి కారణం ఏంటని ఆయన అనుచరులు ఆరా తీశారట. అయితే జనం ఇలా పవన్‌ గురించి పట్టించుకోకపోవడానికి కారణం ఆయనపై నమ్మకం నశించిపోవడమేనంటున్నారు. పవన్‌పై ఆశలు పెట్టుకుంటే వచ్చేది శూన్యం అన్న విషయం జనానికి అర్థమైపోయిందంటున్నారు. ఇలా పవన్‌ గురించి జనం కనీసం చర్చించుకోవడం కూడా మానేయడం బట్టి ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూసే అంశమేనంటున్నారు.

జనం కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించకుండా… ఎన్నికలకు ఏడాది ముందు హడావుడి చేద్దామని పవన్ భావించవచ్చని కానీ ఆ ఎత్తు 2014 ఎన్నికల్లో పవన్‌ వాడేశారని చెబుతున్నారు. కాబట్టి అదే ఎత్తు 2019లో కూడా వేయాలనుకోవడం అవివేకమే అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయినా ఒక్క పవన్ విషయంలోనే కాదు. ప్రజాసమస్యలపై స్పందించని నేతల గురించి ప్రజలు కూడా చర్చించుకోవాల్సి అవసరం ఏముంటుంది?.

Click on Image to Read:

pranab-chandrababu-naidu

karanam balaram

ys jagan1

ys jagan

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

paritala sunitha

modi

vishnu kumar raju

lokesh

balakrishna

amaravathi central pollution control board

chandrababu naidu

Sadguru Jaggi Vasudev chandrababu naidu

First Published:  4 Aug 2016 11:11 PM GMT
Next Story