10 నిమిషాలే… మోదీ మాటతో ఏమీ మాట్లాడలేకపోయాం- జేసీ

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. భేటీ అనంతరం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఎన్‌టీవీతో మాట్లాడారు. లోపల ఏం జరిగిందన్నదానిపై స్పష్టత ఇచ్చారు. తమ భేటీ 10నిమిషాలకు మించి జరగలేదన్నారు. ప్రత్యేక హోదా లాభాల గురించి కామన్ మాన్‌కు తెలియదని.. కానీ ఆరేళ్ల పిల్లాడి నుంచి 90ఏళ్ల ముసలి వాళ్ల వరకూ హోదా అన్నది సెంటిమెంట్‌గా మారిందన్న విషయాన్ని ప్రధానికి తాను వివరించానన్నారు. ఎన్నికల సమయంలో స్వయంగా హామీ ఇచ్చినందున ప్రత్యేకహోదా ఇవ్వకుండా వెనక్కు వెళ్లడం సరికాదని తాను చెప్పానన్నారు. ఇతర ఎంపీలుకూడా మాట్లాడారని జేసీ చెప్పారు. అయితే తాము అంతా చెప్పింది విని ప్రధాని కేవలం ఒక మాట మాత్రమే మాట్లాడారని జేసీ వెల్లడించారు. యువర్ ప్రాబ్లమ్ ఈజ్‌ మై ప్రాబ్లమ్ అని మాత్రమే ప్రధాని అన్నారన్నారు. ప్రధాని ఆ మాట చెప్పడంతో ఇక తాము ఏమీ మాట్లాడలేకపోయామన్నారు. భేటీ 10 నిమిషాలకు మించి జరగలేదని కానీ… ప్రధాని మనసులో ఏదో చేయాలన్న ఉద్దేశం ఉన్నట్టు అనిపించిందన్నారు.

Click on Image to Read:

pranab-chandrababu-naidu

pawan-kalyan

karanam balaram

ys jagan1

ys jagan

Also Read    క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..! 

                       17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…! 

                       విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

paritala sunitha

modi

vishnu kumar raju

lokesh

balakrishna

amaravathi central pollution control board

chandrababu naidu