సుకుమార్ నుంచి మరో క్రేజి ప్రాజెక్టు…

సుకుమార్ డైరక్ట్ చేసే సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కేవలం అతడి డైరక్షనల్ వెంచర్స్ మాత్రమే కాదు… నిర్మాతగా కూడా సుకుమార్ తన విలక్షణత చాటుకున్నాడు. మొదటి ప్రయత్నంగా ఈ దర్శకుడు నిర్మించిన కుమారి 21-ఎఫ్ బోల్డ్ ఎటెంప్ట్ గా నిలిచిపోయింది. కాసులు కూడా కురిపించింది. మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా టీం మొత్తానికి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సుకుమార్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. ఇందులో హీరో శర్వానంద్.

అవును… డిఫరెంట్ మూవీస్ తీసే సుకుమార్, డిఫరెంట్ కథల్ని సెలక్ట్ చేసుకునే శర్వానంద్ కలిశారు. సుక్కూ బ్యానర్ పై శర్వా ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. కుమారి 21-ఎఫ్ సినిమాను తెరకెక్కించిన పల్నాటి సూర్య ప్రతాప్… ఈసారి కూడా దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. శర్వానంద్ తన 25వ చిత్రంగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి.

Also Read    క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..! 

                       17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…! 

                       విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…