రేపట్నుంచే పవన్ సినిమా…

ఇప్పటివరకు అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. పవన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపట్నుంచే (శనివారం) ప్రారంభమౌతోంది. ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోలేదు పవన్. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా లిబరల్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తాన్ని దర్శకుడు డాలీ చేతిలో పెట్టాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం చూపించినంత చొరవను కడప కింగ్ ప్రాజెక్టుపై చూపించడం లేదు. కేవలం నటించడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు పవన్.

కడప కింగ్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తిచేసేందుకు ఎర్లీ కాల్షీట్ ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నాడట పవన్. సాధారణంగా ఉదయం 10-11గంటల మధ్య షూటింగ్ మొదలవుతుంది. సీన్ వివరించి, షాట్ కంప్లీట్ చేసే సరికి.. మధ్యాహ్నం భోజనాలు కూడా కంప్లీట్ అయి… ఒక్కోసారి సాయంత్రం 5 కూడా అయిపోతుంది. ప్రతి సినిమా షెడ్యూల్ ఇలానే ఉంటుంది. కానీ కడప కింగ్ సినిమాను వేగంగా పూర్తిచేసే ఉద్దేశంతో.. ఉదయం 9 గంటల నుంచే కాల్షీట్ ఇవ్వడానికి పవన్ అంగీకరించాడట. దీనివల్ల ఒకే రోజులో మరిన్ని ఎక్కువ సీన్లు తీసే అవకాశం ఏర్పడుతుంది.

Also Read    క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..! 

                       17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…! 

                       విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

                   సుకుమార్ నుంచి మరో క్రేజి ప్రాజెక్టు…