Telugu Global
Cinema & Entertainment

శేఖ‌ర్ క‌మ్ముల‌తో మ్యాచ్ ఫిక్స్...! 

యువ హీరో వ‌రుణ్ తేజ్    ఒక డిఫ‌రెంట్ పాత్ లో వెళ్తున్న న‌టుడు.   మెగా  ఫ్యామిలీ నుంచి ఈ యువ హీరో ..కేవ‌లం   క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలే కాకుండా..  న‌టుడిగా  త‌న ప్ర‌తిభ‌ను చాటుకునే ప్ర‌య‌త్నాలు ఘ‌నంగాచేస్తున్నాడు. త‌న మొద‌టి చిత్రం   ముకుంద..ఆ త‌రువాత  కంచె చిత్రాలు  న‌టుడిగా త‌న సత్తాను చాటుకున్నాడు.   పూరి జ‌గ‌న్నాధ్ తో క‌ల‌సి  లోఫ‌ర్ చిత్రంతో   క‌మ‌ర్షియ‌ల్  ఎలిమెంట్స్  వున్న చిత్రం కూడా చేసి […]

శేఖ‌ర్ క‌మ్ముల‌తో మ్యాచ్ ఫిక్స్...! 
X
యువ హీరో వ‌రుణ్ తేజ్ ఒక డిఫ‌రెంట్ పాత్ లో వెళ్తున్న న‌టుడు. మెగా ఫ్యామిలీ నుంచి ఈ యువ హీరో ..కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలే కాకుండా.. న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను చాటుకునే ప్ర‌య‌త్నాలు ఘ‌నంగాచేస్తున్నాడు. త‌న మొద‌టి చిత్రం ముకుంద..ఆ త‌రువాత కంచె చిత్రాలు న‌టుడిగా త‌న సత్తాను చాటుకున్నాడు. పూరి జ‌గ‌న్నాధ్ తో క‌ల‌సి లోఫ‌ర్ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం కూడా చేసి మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.
ఇక తాజాగా సెన్స్ బుల చిత్రాలు చేసే ద‌ర్శ‌కుడిగా పేరున్న శేఖ‌ర్ క‌మ్ముల‌తో ఫిదా అయ్యాడు. వ‌రుణ్ తేజ్‌, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిదా’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్‌కమ్ముల, నిర్మాత దిల్‌రాజు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కథానాయిక సాయి పల్లవి తదితరులు పాల్గొన్నారు. మ‌రి ఈ చిత్రం త‌రువాత వ‌రుణ్ తేజ్ కు ఏ విధ‌మైన ఇమేజ్ వ‌స్తుందో.
First Published:  6 Aug 2016 1:50 AM GMT
Next Story