రెడ్లపై కాలేసేందుకు మరో కుర్ర హీరో రెడీ…

By- రామనాథ్ నార్పల- రెడ్డి సమాజికవర్గానికి ఆంధ్రప్రదేశ్‌ను సగ కాలం ఏలిన చరిత్ర ఉంది. పౌరుషానికి బ్రాండ్‌ అన్న ట్యాగ్‌ కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.. ప్రస్తుతానికి అధికారంలో లేకపోయినా అటు తెలంగాణ, ఇటు ఏపీలో అధికార పార్టీకి సవాల్‌గా ఉన్నది కూడా ఈ రెడ్లే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే. ఇంత హిస్టరీ ఉన్నా కూడా రెడ్డకు సినిమావాళ్ల నుంచి మానసిక వేధింపులు తప్పడం లేదు. వేధింపులు అనేకంటే రెడ్ల చేతగాని తనం కూడా ఉందేమో అనిపించకమానదు. రెడ్లను సినిమాల్లో విలన్లుగా చూపించడం చాలకాలంగా నుంచే వస్తోంది. రెడ్లు ముఖ్యమంత్రులు ఉన్న సమయంలోనూ ఈ తంతు సాగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ పోకడ శృతి మించింది.

సొంతకులాభిమానంతో పాటు రెడ్లంటే ద్వేషభావం పెంచుకున్న కొందరు దర్శకులు … రెడ్ల బతుకులను సినిమాల్లో హీనంగా చూపెడుతున్నారు. రెడ్లను విలన్లుగా చూపించడంతో మొదలైన ఈ ట్రెండ్‌ ఇప్పుడు రెడ్ల కుటుంబాల్లోని మహిళలను కూడా నీచంగా చూపించే స్థాయికి వెళ్లింది. కథకు అవసరం లేకున్నా రెడ్డి కులాన్ని ఒక కేరెక్టర్‌కు పెట్టడం పదేపదే రెడ్డి పేరుతో దూషించడం పరిపాటిగా మారింది. ఈ రెండేళ్లలోనే అలాంటి సినిమాలు ఒక పదికిపైగా వచ్చాయి. త్రివిక్రమ్‌ సినిమా ”అఆ”లో ప్రతాప్ రెడ్డి అనే ఒక అర్థం లేని కేరెక్టర్‌ను పెట్టారు. కేవలం రెడ్డి కులాన్ని తిట్టడానికే అన్నట్టు ఆ పాత్ర ఉంటుంది. తాజాగా నటుడు సాయికుమార్‌ కొడుకు ఆది నటించిన ”చుట్టాలబ్బాయి” సినిమాలోనూ రెడ్లను వాడేశారు. ఇక్కడ రెడ్డి కేరెక్టర్‌ను కామెడీకి వాడేశారు. ఆ పాత్ర పేరు ”ఈగో రెడ్డి” అని పెట్టారు.  కుర్రహీరో ఆది… ఈగో రెడ్డి పాత్రను ఉద్దేశించి ”ఈగో రెడ్డి అంటే గోన గన్నారెడ్డిలా ఉంటాడనుకున్నా వీడేంట్రా గోనెసంచులు అమ్ముకునే వాడిలా ఉన్నాడు” అంటూ హేళన చేస్తాడు. ఈగో రెడ్డి కేరెక్టర్‌ను కించపరిచేలా సినిమాలో ఇంకా చాలా డైలాగులున్నాయని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి డైరెక్టర్ ”వీరభద్రం చౌదరి”. అతడే అత్యుత్సాహంతో ఒక రెడ్డి కేరెక్టర్‌ను సృష్టించారని చెబుతున్నారు.

ఈ మధ్యే రెడ్లు ఎందుకు టార్గెట్ అయ్యారు?

రాష్ట్ర విభజనకు ముందు కొందరు పనికిమాలిన సినిమా డైరెక్టర్లు, రచయితలు… తెలంగాణ యాసను కించపరిచేలా, బ్రహ్మణులను జోకర్లుగా, యాదవులు, గౌడ్లను కామెడీ విలన్లుగా చూపెడుతూ సినిమాలు తీశారు. అయితే సమాజంలో కొన్ని వర్గాలను కించపరిచి పైశాచిక ఆనందం పొందే డైరెక్టర్లు, రచయితలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక అప్రమత్తమయ్యారు. ఇప్పుడు తెలంగాణ యాసను, అక్కడి కులాలను కించపరిచేలా సినిమాలు తీస్తే బాక్స్‌లు బద్ధలైపోతాయన్న భయం ఉంది.  బ్రహ్మణులు ఏమీ చేయరన్న ధైర్యంతో ఆ మధ్య ఒక సినిమాలో బ్రహ్మణులను బాగా కించపరుస్తూ ఒక సినిమా తీశారు. దీంతో ఏకంగా బ్రహ్మణ సంఘాలు సదరు హీరో ఇంటి ముందు గొడవ చేసి… ఏకంగా ఆయన కుటుంబానికి పిండం పెట్టేశారు. దీంతో అప్పటి నుంచి బ్రహ్మణులను జోలికి వెళ్లడం కూడా సినిమావాళ్లు తగ్గించేసి వేశారు. రెడ్లనే ఇప్పుడు బాగా టార్గెట్ చేయడానికికారణం ఏమిటంటే? . కులాభిమానంతో ఏపీలో ఒక పార్టీకి మద్దతుదారులుగా పనిచేస్తున్న సినీ పరిశ్రమలోని కొందరు డైరెక్టర్లు తమ సినిమాల్లో వీలైనంత వరకు రెడ్ల పరువును నాశనం చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే పనిగట్టుకుని రెడ్ల కుటుంబాలను కించపరుస్తూ సినిమాలు తీస్తున్నారని చెబుతుంటారు.

రెడ్లు నిజంగానే అసమర్దులా? 

కులాలను, ప్రాంతాలను కించపరుస్తూ సినిమాలు తీయడం కొందరు సినిమావాళ్లకు మొదటి నుంచి కూడా అలవాటే. ఏదో సందర్భంలో బాధిత వర్గాలు తిరిగబడ్డాయి. కానీ ”తాము సింహాలం. సోలోగానే ఉంటాం… గుంపుగా ఉండం” అన్నట్టుగా ఉండే రెడ్ల తీరే సినిమావాళ్లకు కలిసి వచ్చింది. రెడ్లకు కూడా కులసంఘాలు ఉన్నాయి. కానీ వాటిని లీడ్ చేసేవారంతా ఏడాదికొకసారి రెడ్డి వర్గంలోని నాయకులకు సన్మానాలు చేసి సంబంధాలు పెంచుకోవడంలో చూపినంత చొరవ మిగిలిన విషయాల్లో చూపరన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఒక కులాన్ని కించపరిచేలా సినిమాలు తీస్తున్న వారికి ఏపీలో అధికారం అండ ఉందని చెబుతుంటారు. కానీ తెలంగాణలోనూ రెడ్లు ఉన్నారు. ఇక్కడ కేసీఆర్‌ కేబినెట్‌లో చక్రం తిప్పుతున్న వారిలో రెడ్ల హవా బాగానే సాగుతోంది. కానీ వారికి కూడా తమ సామాజికవర్గం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తుందట.

మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఈ సినిమా వాళ్ల నుంచి తెలంగాణ యాసకు భాషకు విముక్తి కలిగింది. పిండప్రదాన ఘట్టంతో సినిమా రంగం నుంచి బ్రహ్మణులకు విముక్తి కలిగింది.? దొరికింది రెడ్లే. చూడాలి ఇప్పటికైనా రెడ్ల సంఘాలకు, రెడ్డి నాయకులకు రోషం వస్తుందో లేకుంటే ప్రొఫైల్ పిక్చర్లకు సింహం బొమ్మలు పెట్టుకుని పౌరుషవంతులమని తమకు తాము సర్దుకుపోతారో!…..

                                                                                             BY-  రామ్ నాథ్ నార్పల

 

 

Click on Image to Read:

modi metting

kcr speach

sunitha

mahatma statue

kcr

mla kurugodla ramakrishna

ramoji rao

jc diwakar reddy

by ramaiah

devineni achem naidu

chandrababu naidu

jaleel khan

minister narayana

cbn

sujana-choudary

boda-uma

karanam balaram

kvp

jc-diwakar-reddy

pawan-kalyan

pranab-chandrababu-naidu

ys jagan1