పోగాలం దాపురించే ఇలా…

ప్రత్యేకహోదా సంజీవిని కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పుపట్టారు. మొన్నటి వరకు చంద్రబాబు పాడిన పాటను ఇప్పుడు వెంకయ్యనాయుడు ఆలపిస్తున్నారని విమర్శించారు. హోదా సంజీవిని కాదన్న చంద్రబాబు ప్రజల ఆగ్రహంతో నోటికి ప్లాస్టర్ వేసుకున్నారని… వెంకయ్యనాయుడు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు అంబటి. ముమ్మాటికి హోదా సంజీవినేనన్నారు. చంద్రబాబు చేస్తున్నపనులు చూస్తుంటే పోగాలం దాపురించినట్టుగా ఉందన్నారు. శిశుపాలుడికి పట్టిన గతే చంద్రబాబుకు త్వరలో పడుతుందన్నారు. విదేశీ మోజులో చంద్రబాబు దేవాలయాలు, విగ్రహాలను కూల్చివేయడం దారుణమన్నారు. బ్రిటిష్ వాళ్లను క్విట్ ఇండియా అన్నట్టుగా… చంద్రబాబును ప్రజలు క్విట్ ఏపీ అనే పరిస్థితి తెచ్చుకోవద్దని అంబటి సూచించారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజ్‌తో ప్రజలను మోసం చేయాలనుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Click on Image to Read:

nayeem encounter

ys jagan

Nayeem murders

Union minister Anupriya Patel

ap ministers

ys-jagan-2

nayeem

sunitha

kcr

mla kurugodla ramakrishna

ramoji rao