Telugu Global
Cinema & Entertainment

విశాఖలో రామ్ హల్ చల్

రామ్ హీరోగా నటిస్తున్న సినిమా హైపర్. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కందిరీగ శ్రీనివాస్ దర్శకుడు. ఈమధ్యంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం సాగరతీరాన సందడి చేస్తోంది. అవును… హైపర్ నయా షెడ్యూల్ విశాఖలో మొదలైంది. ఈనెల 20వ తేదీ వరకు సినిమా యూనిట్ అంతా విశాఖలోనే ఉంటుంది. విశాఖ బీచ్ తో పాటు… అరకు, ఎర్రమట్టి దిబ్బలు లాంటి అందమైన ప్రదేశాల్లో పలు సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ఈ […]

విశాఖలో రామ్ హల్ చల్
X

రామ్ హీరోగా నటిస్తున్న సినిమా హైపర్. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కందిరీగ శ్రీనివాస్ దర్శకుడు. ఈమధ్యంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం సాగరతీరాన సందడి చేస్తోంది. అవును… హైపర్ నయా షెడ్యూల్ విశాఖలో మొదలైంది. ఈనెల 20వ తేదీ వరకు సినిమా యూనిట్ అంతా విశాఖలోనే ఉంటుంది. విశాఖ బీచ్ తో పాటు… అరకు, ఎర్రమట్టి దిబ్బలు లాంటి అందమైన ప్రదేశాల్లో పలు సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈనెల 3వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ దక్కింది. ప్రతి ఇంట్లో ఒక్కడుంటాడు అనే ట్యాగ్ లైన్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 20న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు నిర్మాత ప్రకటన చేసినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం… సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈనెలాఖరకు లేదా వచ్చేనెల మొదటివారంలో సినిమా పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాడు.

First Published:  7 Aug 2016 9:42 PM GMT
Next Story