Telugu Global
Cinema & Entertainment

నిజ జీవితానికి అద్దం పట్టే సినిమా ఇది

వాస్త‌విక దృక్ప‌థంతో చంద్ర శేఖ‌ర్ యేలేటి లాంటి ద‌ర్శ‌కులు చేసిన‌ప్పుడు ఇలాంటి సినిమాలు వ‌స్తుంటాయి. ద‌ర్శ‌క ర‌చ‌యిత‌గా ఆయ‌న పంథా వాస్త‌విక దృక్ప‌థం తో ఉంటుంది. సినిమా అంటే ప్రేక్ష‌కుల వాస్త‌వ జీవితానికి క‌థ సంబంధం ఉండి తీరాలి అని గ‌ట్టిగా న‌మ్మే ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. ”మ‌న‌మంతా” చిత్రం చూస్తుంటే మ‌న జీవితం, మ‌న కోరిక‌లు.. మ‌న అసూయ‌లు.. మ‌న భావోద్వేగాలే కనిపిస్తాయి. మోహ‌న్ లాల్, గౌత‌మి, వాళ్ల పాప రోల్ చేసిన రైనా రావు (సాధు […]

నిజ జీవితానికి అద్దం పట్టే సినిమా ఇది
X

వాస్త‌విక దృక్ప‌థంతో చంద్ర శేఖ‌ర్ యేలేటి లాంటి ద‌ర్శ‌కులు చేసిన‌ప్పుడు ఇలాంటి సినిమాలు వ‌స్తుంటాయి. ద‌ర్శ‌క ర‌చ‌యిత‌గా ఆయ‌న పంథా వాస్త‌విక దృక్ప‌థం తో ఉంటుంది. సినిమా అంటే ప్రేక్ష‌కుల వాస్త‌వ జీవితానికి క‌థ సంబంధం ఉండి తీరాలి అని గ‌ట్టిగా న‌మ్మే ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. ”మ‌న‌మంతా” చిత్రం చూస్తుంటే మ‌న జీవితం, మ‌న కోరిక‌లు.. మ‌న అసూయ‌లు.. మ‌న భావోద్వేగాలే కనిపిస్తాయి. మోహ‌న్ లాల్, గౌత‌మి, వాళ్ల పాప రోల్ చేసిన రైనా రావు (సాధు జీవి లా ఉంది.) అంద‌రిలోను మ‌న మిడిల్ క్లాస్ జీవితం క‌నిపిస్తుంది. సినిమా మొద‌టి సీన్ నుంచి మ‌నం క‌నెక్ట్ అవుతాం. మంచి చిత్రం. చూడాల్సిన చిత్రం. మ‌న‌ల్ని మ‌నం ఐడింటిఫై చేసుకునే సినిమా. కుటంబ స‌మేతంగా చూడ‌త‌గ్గా సినిమా. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సినిమా చూడాల‌నుకునే వారికి ఈచిత్రం న‌చ్చ‌దు.

First Published:  8 Aug 2016 3:58 AM GMT
Next Story