ఆ పార్టీ తరపున నేను పోటీ చేయను…

తనకు హీరోగా అవకాశాలు రావడం లేదన్న మాట నిజం కాదని నటుడు సునీల్ చెప్పారు. ఈ ఏడాది తనవి మొత్తం నాలుగు సినిమాలు ఉంటాయన్నారు. కమెడియన్‌గా ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు విడుదలవడం సహజమన్నారు. కమెడియన్‌గా చేసినప్పుడు ఒక సినిమా హిట్‌ అయినా ప్లాప్‌ అయినా తనకు బాధ్యత ఉండదన్నారు. కానీ హీరోగా అయ్యేసరికి సినిమా జయాపజయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చిరు 150 సినిమాలో కమెడియన్‌గా నటిస్తానని చెప్పారు. ఇకపై కమెడియన్‌గా నటించనని తానెప్పుడూ చెప్పలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ జనసేన తరపున పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలను సునీల్ ఖండించారు. పవన్ అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని కానీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన మాత్రం లేదన్నారు. కావాలంటే పవన్‌ ఏదైనా పని అప్పగిస్తే తన వంతుగా ఆ పని చేస్తానన్నారు. తనకు కుల బలం లేకపోయినా ఈ స్థాయికి వచ్చేవాడినని చెప్పారు. అందుకు కారణం తన అదృష్టమేనని సునీల్ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో సునీల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

allu arjun press meet

sujana

ap special status

trinamool congress

chandrababu naidu hotels

 

government hospitals

deepa karmakar

nayeem encounter

jadeja selfe

ys jagan pressmeet

nayeem

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

ramoji rao