Telugu Global
Cinema & Entertainment

ఇక నుంచి ఒకేసారి రెండు సినిమాలు...

గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సాయిధరమ్ తేజకు పోటీగా ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ కూడా రంగంలోకి దిగాడు. సినిమాల విషయంలో ఈ మెగా హీరో ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఇకపై వరుసగా సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా చేస్తున్న వరుణ్ తేజ… ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే శేఖర్ కమ్ముల […]

ఇక నుంచి ఒకేసారి రెండు సినిమాలు...
X

గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సాయిధరమ్ తేజకు పోటీగా ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ కూడా రంగంలోకి దిగాడు. సినిమాల విషయంలో ఈ మెగా హీరో ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఇకపై వరుసగా సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా చేస్తున్న వరుణ్ తేజ… ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాను ప్రారంభించాడు.

మిస్టర్ సినిమా షెడ్యూల్ ఈమధ్యే యూరోప్ లో జరిగింది. తొలి షెడ్యూల్ లో భాగంగా స్పెయిన్ లో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. మరికొన్ని సన్నివేశాల్ని స్విట్జర్లాండ్ లో కంప్లీట్ చేశారు. ఇకపై సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇప్పుడీ మూవీతో పాటు కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాను కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు వరుణ్ తేజ. ఈనెల 10 నుంచి ఫిదా సెట్స్ పైకి జాయిన్ అవుతాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరుగుతోంది. ఓ వైపు మిస్టర్, మరోవైపు ఫిదా సినిమాల్ని ఒకేసారి కంప్లీట్ చేయాలని నిర్ణయించాడు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత… క్రిష్ దర్శకత్వంలో మరోసారి సెట్స్ పైకి వెళ్లాలని కూడా వరుణ్ నిర్ణయించాడు. ఇలా సినిమాల విషయంలో అనూహ్యంగా స్పీడ్ పెంచాడు ఈ మెగా హీరో.

First Published:  7 Aug 2016 9:43 PM GMT
Next Story