ఇంగ్లీష్ ఏది బాబూ!

ప్రత్యేకహోదా విషయంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, తన పార్టీ ఎంపీలతో పాటు వెళ్లి కలిశారు. ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ప్రణబ్‌ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని కోరామని జగన్‌ చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ ప్రత్యేక హోదా గురించి తెలుగులోనే ప్రెస్‌తో మాట్లాడడాన్ని జగన్‌ ప్రస్తావించారు. ఢిల్లీ వచ్చినా చంద్రబాబు ఇంగ్లీష్‌లో ఒక్కసారి కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే ప్రధానికి నేరుగా అర్థమవుతాయని అందుకు భయపడే చంద్రబాబు హోదా గురించి ఇంగ్లీష్‌లో మాట్లాడడం లేదన్నారు. ప్రత్యకహోదా ఇస్తామని పార్లమెంట్‌లోనే హామీ ఇచ్చారని దాన్ని నెరవేర్చకపోతే ఇక ప్రజాస్వామంలో ఎవరిని అడగాలని జగన్ ప్రశ్నించారు. ఒకవైపు గుళ్లను కూల్చేస్తూ తిరిగి పుష్కరాలకు పెద్దలను పిలిచేందుకు చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రపతిని కలిసినప్పుడు తన పనితీరును మెచ్చుకున్నారని చంద్రబాబు అనుకూల పత్రికలో కథనం రాయించుకోవడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు అక్కడ ఏ విలేకరి కూడా ఉండరని… అయినా సరే రాష్ట్రపతి మొచ్చుకున్నారంటూ కథనం రాయించుకున్నారని జగన్ అన్నారు. ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇచ్చిన పెద్దలందరినీ కలుస్తామన్నారు. తాము చంద్రబాబులాగా పుష్కరాలకు పిలిచేందుకు వచ్చామని చెప్పబోమని… ప్రత్యేక హోదా గురించి అడిగేది గట్టిగానే అడుగుతామన్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని తాము వదిలేస్తే అడిగే వాళ్లే ఉండరని జగన్ అన్నారు.

Click on Image to Read:

sunil1

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

nayeem

sunitha

kcr

mla kurugodla ramakrishna

ramoji rao