నేను డబ్బులిచ్చా- సుజనా సంచలన వ్యాఖ్యలు

తెలుగుగ్లోబల్.కామ్- టీడీపీ నేతలు కెమెరాల సాక్షిగా నిజాలు మాట్లాడుతున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యమో ఏమో గానీ తాము చేస్తున్న డబ్బు రాజకీయాల గురించి ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. మొన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు తాను 2014 ఎన్నికల్లో రూ. 11. 5 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి సంచలనం సృష్టించారు. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదులు వెళ్లడం, నోటీసులు రావడం జరిగింది. తాజాగా టీడీపీ కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒక తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీలను తాను డబ్బుతో ఎలా మేనేజ్ చేస్తున్నది మాటల్లో బయటపెట్టేశారు.

టీడీపీకి డబ్బులు ఖర్చు పెట్టింది మీరేనటగా అని ప్రశ్నించగా…ప్రస్తుతం పార్టీకి ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే మీడియా ప్రతినిధి ఇప్పుడు కాదు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చారా అని ప్రశ్నించగా… ”వ్యాపారం చేసేటప్పుడు అన్ని పార్టీలకు ఇచ్చాను ప్రత్యేకంగా టీడీపీకే ఇవ్వలేదు” అని సుజనా సమాధానం చెప్పారు. ఒక విధంగా వ్యాపారాలు చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశానని సుజనా చౌదరి ఒప్పుకున్నారు. ఒక కేంద్రమంత్రిగా ఉంటూ ఇలా వ్యాపారం చేసుకునేటప్పుడు అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చానని చెప్పడం దిగ్బ్రాంతికరమే.  డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సిన వ్యాపారాలు ఏముంటాయో?.

Click on Image to Read:

allu arjun press meet

ap special status

ys jagan pressmeet

sunil1

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

nayeem

sunitha

kcr

mla kurugodla ramakrishna

ramoji rao