ఉరకలేస్తున్న ఓదార్పు ”జర్నలిజం”

”నాకు ఈ వయసులో కావాల్సింది నిజాలు కాదు. జ్ఞాపకాలు”. ఇది ఒక హిట్‌ మూవీలోని డైలాగ్‌. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని మీడియా సంస్థలు కూడా పచ్చపాతంతో బాధపడుతూ నిజాలు అక్కర్లేదు, ఉదయం వినోదభరితంగా, ఆహ్లాదకరంగా వార్తలు కనిపిస్తే చాలు అన్నట్టుగా తయారయ్యాయి. నమ్మి ఫాలో అవుతున్న జనానికి కూడా అదే మత్తు ఎక్కిస్తున్నాయి. అబద్ధానికి రంగులేసి జనం మీదకు వదులుతున్నాయి కొన్ని పత్రికలు. ఉదయమే ఆ పత్రికలను చదివే జనం కూడా అదే నిజమనుకుని భ్రమిస్తూ ఆఫీసులకు బయలుదేరుతుంటారు.  రాష్ట్రపతి ప్రణబ్‌తో చంద్రబాబు, జగన్‌ భేటీపై చంద్రబాబు అనుకూల పత్రికలు రెండుప్రచురించిన కథనాలే నిదర్శనం.

రాష్ట్రపతిని కూడా ఒక ఐటమ్‌లా మార్చుకుని ఈ రెండు పత్రికలు వేసిన విన్యాసాలు చూసి కాస్త నిజాలు నిర్దారించుకోగలిగిన వారంతా అవాక్కవుతున్నారు. భేటీ సందర్భంగా చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని ప్రణబ్‌ ముఖర్జీ మెచ్చుకున్నారంటూ ”ఈనాడు” పత్రిక పెద్ద కథనాన్ని అచ్చేసింది. ఆ కథనంపై సోషల్‌ మీడియాలో పెదెత్తున సెటైర్లు పడ్డాయి. కొందరు రాష్ట్రపతి భవన్‌ దృష్టికి ఆన్‌లైన్‌లో ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మొత్తం మీద ఈ కథనంతో ఈనాడు పత్రిక పరువు పోగొట్టుకుంది. అయితే బాబు పరువు తీశారన్న కోపమో ఏమోగానీ సోమవారం రాష్ట్రపతితో జగన్ భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు తోకపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

చంద్రబాబు పాలన బాగుంది అంటూ జగన్ వద్ద కూడా ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారట. పక్కనే ఉండి రికార్డు చేసుకుని, పత్రికా కార్యాలయాలనికి వచ్చి ప్రతిమాటను యతాథతంగా అచ్చేసినట్టుగా కొటేషన్లు పెట్టి మరీ ‘ చంద్రబాబు బాగానే చేస్తున్నారుగా’ అని రాష్ట్రపతే జగన్ ముందు కితాబిచ్చారట. నిజంగా తలలో మెదడు ఉన్న వారెవరైనా ఈ విషయాన్ని నమ్ముతారా అన్నది ఆ పత్రిక ఆలోచించినట్టుగా లేదు. జగన్ రాష్ట్రపతి సమావేశమైనప్పుడు ఒకవేళ రాష్ట్రపతి చంద్రబాబును పొగిడివున్నా ఆ విషయం ఈ పత్రికకు జగన్ చెబుతాడా? రాష్ట్రపతి చెబుతాడా? జనాల్ని వెర్రివెంగళాయిలుగా భావించి ఇలాంటి కథనాలు రాయడానికి అలవాటుపడ్డారు.  ఒక లీడర్‌ ముందు మరో లీడర్‌ను పొగిడేంత అమాయకులా రాష్ట్రపతి. చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ వన్‌గా ఉందంటూ కేంద్ర సంస్థే ధృవీకరించిన తర్వాత కూడా చంద్రబాబు పాలన బాగుంది అని ప్రణబ్ కితాబు ఇస్తారా?. చంద్రబాబును అలా వెనుకేసుకురావడానికి ఆయనేమన్న ప్రణబ్‌ ముఖర్జీకి బామ్మర్ది అవుతారా?.   రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ కదా ఏం రాసినా ఏమీ చేయలేరులే అన్న ధీమా కాబోలు. ఇలాంటి పచ్చకథలను మోదీని చంద్రబాబు కలిసినప్పుడు మాత్రం సదరు పత్రికలు రాయవు. ఎందుకంటే మోదీ గురించి కట్టుకథలు రాస్తే తోకలు కట్ అవుతాయని పచ్చ మీడియాకు బాగా తెలుసు. ఈ పత్రికల వ్యవహార శైలి ఇలా తయారవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి.

తమ పత్రికలను చదువుతున్న వారంతా టీడీపీ అభిమానులు, అమాయక జనం అన్నది సదరు పత్రికా యాజమాన్యాల ప్రగాడ నమ్మకం. అందుకే నిజాలతో పనిలేకుండా ఊహాజనిత కథనాలు అచ్చేసి టీడీపీ అభిమానులకు మానసిక ప్రశాంతత పంచడం, చంద్రబాబు పాలనపై పచ్చశ్రేణులు ఆందోళన చెందకుండా ఓదార్పు కథనాలు రాయడం వాటి అలవాటుగా మారింది. అదే సమయంలో అమాయకులెవరైనా తమ పచ్చకథలు నమ్మి చంద్రబాబు వైపు నిలుస్తారన్న ఆశ. అందుకే సదరు పత్రికల్లో ఊహలకు ఇచ్చినంత ప్రాధాన్యత నిజాలకు ఉండడం లేదు. బహుశా సదరు పత్రికల్లో పనిచేయాలంటే జర్నలిస్టులకు కూడా ఊహాశక్తే ఎక్కువ ఉండాలి కాబోలు.

Click on Image to Read:

allu arjun press meet

sujana

ys jagan pressmeet

sunil1

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

nayeem

sunitha

kcr

mla kurugodla ramakrishna

ramoji rao