Telugu Global
Cinema & Entertainment

కొడుకులతో కలిసి మరోసారి....

మంచు విష్ణు, మంచు మనోజ్ తో కలిసి ఇప్పటికే ఓ సినిమా చేశాడు మంచు మోహన్ బాబు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తండ్రికొడుకులంతా కనిపిస్తారు. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. దీంతో కలిసి నటిస్తే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని మోహన్ బాబు గ్రహించారు. అందుకే ఈసారి కొడుకులిద్దరితో వేరువేరుగా సినిమాలు చేయాలని నిర్ణయించారు. మంచు విష్ణుతో త్వరలోనే ఓ సినిమా చేస్తానని… తిరుపతిలో ప్రకటించారు కలెక్షన్ కింగ్. ఆ సినిమాకు సేనాపతి […]

మంచు విష్ణు, మంచు మనోజ్ తో కలిసి ఇప్పటికే ఓ సినిమా చేశాడు మంచు మోహన్ బాబు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తండ్రికొడుకులంతా కనిపిస్తారు. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. దీంతో కలిసి నటిస్తే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని మోహన్ బాబు గ్రహించారు. అందుకే ఈసారి కొడుకులిద్దరితో వేరువేరుగా సినిమాలు చేయాలని నిర్ణయించారు. మంచు విష్ణుతో త్వరలోనే ఓ సినిమా చేస్తానని… తిరుపతిలో ప్రకటించారు కలెక్షన్ కింగ్. ఆ సినిమాకు సేనాపతి అనే టైటిల్ కూడా కన్ ఫర్మ్ చేశారు. ఈ సినిమా తర్వాత మంచు మనోజ్ హీరోగా చేయబోయే మరో సినిమాలో కూడా నటిస్తానని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది ప్రారంభమౌతాయని తెలిపారు. తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మోహన్ బాబు… ఈ విషయాల్ని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు తన సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థపైనే తెరకెక్కుతాయని విషయాన్ని కూడా మోహన్ బాబు స్పష్టంచేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్క మూవీలోనైనా మంచు లక్ష్మి కనిపిస్తారా లేదా అనే విషయాన్ని మోహన్ బాబు వెల్లడించలేదు.
First Published:  9 Aug 2016 10:38 PM GMT
Next Story